మంత్రి లక్ష్మణ్ కుమార్ చొరవతో సబ్సిడీ నిధులు విడుదల !

👉 సీఎంస్టీఈఐ పథకానికి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం !

J.SURENDER KUMAR

గిరిజన యువ పారిశ్రామికవేత్తలకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న (CMSTEI ) Chief Minister Scheduled Tribes Entrepreneurship and Innovation పథకం కింద నిలిచిపోయిన ప్రాజెక్టులకు  ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో ప్రభుత్వం కొట్లాది నిధులు విడుదల చేసింది.

👉 వివరాల్లోకి వెళ్ళితే….

సీఎంస్టీఈఐ పథకం పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది అభ్యర్థులు ఎంపిక అయ్యారు. అందులో 18 మంది లబ్ధిదారులకు తుది ప్రొసీడింగ్స్ అందజేశారు.  ప్రాజెక్టుల గ్రౌడింగ్ కు అవసరమైన సబ్సిడీ విడుదలలో ఆలస్యం కారణంగా లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన ₹ 50 కోట్లలో భాగంగా ఒక త్రైమాసికానికి సంబంధించిన  ₹ 12.30 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ₹ 8.16 కోట్లు 18 మంది లబ్ధిదారులకు సబ్సిడీగా అందజేశారు.

దాదాపు రెండున్నర సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సబ్సిడీ నిధులు విడుదల చేయడంతో లబ్ధిదారుల జీవితాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

ఈ పథకంలో ప్రాజెక్ట్ ఆర్థిక నిర్మాణం వ్యయంలో 35 శాతం సబ్సిడీ ప్రభుత్వం అందజేస్తుండ గా, 55 శాతం బ్యాంకు రుణం, 10 శాతం లబ్ధిదారుడి వాటాతో  చెల్లించాలి. సబ్సిడీ విడుదలతో నిలిచిపోయిన ప్రాజెక్టులు ముందుకు సాగి ఎంపికైన యువతతో పాటు మరి కొంత మందికి ఉపాధి మార్గాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న నిధులు విడుదల కావడంతో లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  చొరవ తీసుకోవడంతో సమస్య పరిష్కారం అయ్యిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు మంగళవారం  సచివాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను  కలిపి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

గిరిజన యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగేందుకు ఇది ఒక కీలక అడుగని వారు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి  ఆలోచనతో రానున్న రోజుల్లో గిరిజనుల ఆర్థిక అభివృద్ధి సాధించడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని అవసరమైన నిధులు విడుదల చేస్తుందని అన్నారు.

👉 మంత్రి చోరవను మరువలేము !

యువ పారిశ్రామికవేత్త తేజావత్ ప్రవీణ్ కుమార్ తన అనుభవాన్ని వెల్లడిస్తూ, “One Stop Solution to Farmers” పేరుతో వ్యవసాయ ఆధారిత వ్యాపారాన్ని స్థాపించాలనే సంకల్పంతో ముందుకొచ్చినప్పటికీ, రెండున్నర సంవత్సరాలుగా నిధులు లేక లభించక ప్రాజెక్టు నిలిచిపోయిందన్నారు. తాజాగా ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేయడంతో తమ ప్రాజెక్టుకు ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు.

గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సమస్యను తీసుకువెళ్ళిన వెంటనే స్పందించి, ముఖ్యమంత్రి తో పాటు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించడంలో కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో TRICOR చైర్మన్ బెల్లయ్య నాయక్, ట్రైబల్  వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సంతోష్,GM శంకర్ రావు , స్టేట్ మిషన్ మేనేజర్ లక్ష్మీ ప్రసాద్, DGM రవి కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.