👉 నేడు మంత్రి పుట్టినరోజు !
J.SURENDER KUMAR,
రెండు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో అవమానాలు, అణచివేతలు, అరెస్టులు, అక్రమ కేసులు, హేళనలు, కుల వివక్షత, పలు ఓ టములు పడిలేసిన కెరటంలా… ఓటమి, అవమానలు … దిగమింగుకొని . పట్టు వదలని విక్రమార్కుడిగా…. ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై ……. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పై రాజిలేని పోరాటం చేసి….. 2023 ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అడ్లూరీ లక్ష్మణ్ కుమార్, బుధవారం 59 వసంతంలోకి అడుగు పెడుతున్నారు నేడు ఆయన పుట్టినరోజు..
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరో.. అని ఏ కవి రాశాడో ఆ. అక్షరాలు అక్షర సత్యంగా అగుపిస్తున్నాయి. 2014 నుంచి 2023 వరకు బలవంతంగా కొందరు పోలీసులు అనేక సందర్భాలలో అరెస్టులు చేశారో, అక్రమ కేసులు నమోదు చేశారో, ఆ పోలీస్ లు, అధికారులు ఆ నాయకుడు మంత్రి లక్ష్మణ్ కుమార్ కు, సెల్యూట్ చేస్తూ, పూల బొకే అందిస్తూ, శాలువాలు కప్పి సన్మానిస్తున్నారు.

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ !
మాజీ జెడ్పీ చైర్మన్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ ఎ.పి.ఎస్.ఎఫ్.సి. చైర్మన్ ,
2009 లో
నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం ధర్మపురి నియోజకవర్గం ( ఎస్సీ) పోటీ చేసి 1,365 ఓట్ల స్వల్ప తేడాతో ఎన్నికల్లో ఓటమి.
2018 లో ధర్మపురి నుంచి ఎమ్మెల్యే పోటీ చేసి 441 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు.
👉 తండ్రి పేరు నాగయ్య.
👉 పుట్టిన తేదీ 01-04-1968
👉 స్వగ్రామం ! పెద్దపల్లి..
👉 విద్యా ! ఇంటర్మీడియట్ ఐటిఐ పెద్దపల్లి.
👉 సామాజిక వర్గం ! ఎస్సీ (మాదిగ)
👉 1982-1985
లో NSUI విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా . గోదావరిఖని జూనియర్ కళాశాల గెలుపు.
👉 1986-1994
ఉమ్మడి కరీంనగర్ జిల్లా NSUI ప్రధాన కార్యదర్శిగా..
👉 1994-1996
జనరల్ సెక్రటరీ, జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ, కరీంనగర్.
👉 1996-2001
ఏ.పి. యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి!
👉 ధర్మారం జడ్పిటిసి సభ్యుడిగా గెలుపు !
2006 టీడీపీ ఎమ్మెల్యే & మాజీ మంత్రి మాతంగి నర్సయ్యపై జెడ్పీటీసీ ధర్మారం మండలం (ఎస్సీ రిజర్వ్డ్) పోటీ చేసి మూడువేల మెజార్టీ ఓట్లతో గెలుపొందారు.
👉 2010-2012 లో
కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా పనిచేశారు
👉 2013-2014
చైర్మన్, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల ఫైనాన్స్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రధాన కార్యదర్శి (పిసిసి) ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్
👉 2019
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీకి జిల్లా అధ్యక్షుడిగా..
👉 2023 లో ఎమ్మెల్యేగా విజయం !

ధర్మపురి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా 21692 ఓట్ల మెజార్టీతో సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి కొప్పుల ఈశ్వర్ పై విజయం సాధించారు
👉 2006 లో..
స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మారం జడ్పిటిసి సభ్యుడిగా మాజీ మంత్రి మాతంగి నరసయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా లక్ష్మణ్ కుమార్ పోటీపడ్డారు. ఎన్నికల్లో మాజీ మంత్రి మాతంగి నరసయ్య పై లక్ష్మణ్ కుమార్ ,మూడు వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
👉 2025 లో క్యాబినెట్ మంత్రిగా..

2025 జూన్ 8న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండో విడత విస్తరించిన మంత్రివర్గంలో కేవలం ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారు. అందులో అట్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి పదవి దక్కింది.
👉 ప్రలోభాలకు లొంగలేదు పార్టీ మారలేదు !

1982 లో విద్యార్థి దశ నుంచే అనుబంధ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం (NSUI ) కొనసాగుతున్న లక్ష్మణ్ కుమార్, ను అధికార టిఆర్ఎస్ పార్టీ , పదవులు పార్టీ టికెట్లు ఇస్తా అంటూ ప్రలోభాలకు గురి చేసిన కాంగ్రెస్ పార్టీ నీ లక్ష్మణ్ కుమార్ పార్టీ వీడలేదు..
