మావోయిస్టు అగ్రనేత గణపతిది మాస్టర్ మైండ్ !

👉 వార్ కార్యదర్శిగా 16 రాష్ట్రాలకు … మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా 14 సంవత్సరాల ప్రస్థానం !

👉 అనారోగ్యమా ?  నాయకత్వానికి అందుబాటులో లేడా ?

J.SURENDER KUMAR,

దశాబ్దాల వార్, మావోయిస్టు ఉద్యమ చరిత్రలో మిలిటెంట్. స్థాయి నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, అంతర్జాతీయ స్థాయి రెవల్యూషన్ కమిటీ నాయకుడిగా  ఎదిగి 16 రాష్ట్రాలలో మావోయిస్టు కార్యకలాపాలను విస్తరింపజేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాంతర ప్రభుత్వం నిర్వహించి సవాల్ విసిరిన ముప్పాళ్ళ లక్ష్మణరావు @ గణపతిది  మాస్టర్ మైండ్ …

పీపుల్స్ వార్ ఉద్యమానికి  ఊపిరి ఊది, బీహార్ మావోయిస్టు పార్టీ కమిటీలో విలీనం చేసి కేంద్ర కమిటీ అగ్రనేతగా కొనసాగిన ముప్పాల లక్ష్మణరావు, @ అలియాస్ గణపతి స్వగ్రామం జగిత్యాల జిల్లా  మారుమూల అటవీ గ్రామం బీర్పూర్ కావడం ప్రత్యేకత.

👉  ఐదు దశాబ్దాల అజ్ఞాత నేపథ్యం..

ఉపాధ్యాయ వృత్తి లో విధులు నిర్వహిస్తూ 1970-72 లో అజ్ఞాత బాట పట్టిన ముప్పల లక్ష్మణరావు ఐదు దశాబ్దాల అజ్ఞాతంలో అరెస్ట్ అయింది ఓకే ఒక్కసారి. దాదాపు 58 సంవత్సరాల పైబడిన బీర్పూర్, గుట్ట కింద గ్రామస్తులకు, అతని బంధు వర్గం గాని గణపతినీ గుర్తుపట్టగలుగుతారు. 58 సంవత్సరాల వయస్సు లోపు వారు గణపతి ని గుర్తుపట్టలేరు.

👉 వర్గ శత్రువు నిర్మూలనకు శ్రీకారం !

పీపుల్స్ వార్ ఉద్యమాన్ని అణచి వేసేందుకు ఎన్ కౌంటర్లో పాల్గొన్న పోలీసులను హతమార్చేందుకు పీపుల్స్ వార్ 1985 లో ఇక్కడే శ్రీకారం చుట్టింది. 1985 మే 25న పోలీసులు ధర్మపురి మండలం నక్కలపేట గ్రామ సమీపంలో ఓ ఇంట్లో దాగి ఉన్న నక్సలైట్ తుమ్మ లక్ష్మినర్సయ్యను, పట్టుకోవడానికి వెళ్లగా జరిగిన ఎదురు కాల్పులలో అమాయకుడు గుడ్ల నారాయణ   మృతి చెందారు.  ఆకారణం తను పట్టుకొని కాల్చిచంపడం కోసం పోలీసు చర్యలను ఆదిలోనే అడ్డుకట్ట వేయడం కోసం ఆ ఎన్కౌంటర్ లో పాల్గొన్న రిజర్వుడ్ కానిస్టేబుల్  కోమల్ రెడ్డిని ధర్మపురి పట్టణ బస్టాండులో 1985 జూలై 23న  జనం చూస్తుండగా కాల్చిచంపి ఆయన ఆయుధం ( రివాల్వర్) ను ఎత్తుకెళ్లారు.

👉 కోవర్టు హత్యలకు శ్రీకారం ఇక్కడే !

పీపుల్స్ వార్ ఉద్యమ ఉధృతి పతనానికి పోలీసులు ఉపయోగించిన కోవర్ట్ పథకమును మొదట గుర్తించి వారి హత్యలకు శ్రీకారం చుట్టింది ఈ డివిజన్ లో .. పీపుల్స్ వార్  సానుభూతిపరుడుగా, మిల్టెంట్ గా, కొనసాగినా దోనూర్ గ్రామానికి చెందిన బసవరాజు అంజయ్యను ,పోలీసులు కోవర్టుగా మారడంతో ,వార్ నక్సల్స్ బసవరాజు అంజయ్యను కాల్చి చంపడంతో పాటు పలువురు కోవర్ట్ అనుమానితులను గ్రామాల్లో ప్రజా కోర్టు నిర్వహించి, ప్రజల సమక్షంలో వారి తప్పిదనాలు వివరిస్తూ కాల్చి చంపారు.

👉 పోలీస్ సవాలుకు – ప్రతి సవాల్  మొట్టమొదటి మందు పాతరల ప్రయోగం !

ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ లు గా ముద్రపడిన జగిత్యాల డి.ఎస్.పి సీఐల  పోలీసు అధికారులు జగిత్యాల డి.ఎస్.పి, సిఐలను హతమార్చడం  కోసం  నక్సల్స్ ఉద్యమ చరిత్రలో మొట్టమొదటిసారి ముందు పాతరల మరణ హోమం కు శ్రీకారం చుట్టింది జగిత్యాల డివిజన్ లో..


1989 సెప్టెంబర్ లో మండల కేంద్రం సారంగాపూర్ నుండి  బీర్పూర్ కు వచ్చే  ఘాట్ రోడ్డు దారిలో  ఓ కల్వర్టు కింద నక్సలైట్లు ఎనిమిది మందుపాతరలు అమర్చారు. బీర్పూర్ గ్రామానికి  వస్తున్న జీవును  విచారణ కోసం వస్తున్న పోలీసు జీవుగా అంచనా వేసి మందుపాతర ను పేల్చారు.  ఈ సంఘటనలో పోలీసులకు బదులుగా 14 అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిశాయి

👉 బీర్పూర్ కు హోం మంత్రి రావడమే నక్సల్స్ కు  మింగుడు పడలేదా ?

1989 ఆగస్టు మాసంలో అప్పటి హోంశాఖ మంత్రి స్వర్గీయ ఎలిమినేటి మాధవరెడ్డి, సారంగాపూర్ మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన బీర్పూర్ కు వచ్చి ప్రజల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా నక్సల్స్ నాయకులు, మీ గ్రామాభివృద్ధికి ఏం చేశారు ?  అంటూ  ప్రజలను రెచ్చగొట్టే రీతిలో  హోం మంత్రితో, పోలీసుల ప్రసంగం చేయించారు అని నక్సల్స్ భావించారు. తమ ఆధిపత్య సామ్రాజ్యంలో  హోంమంత్రి పర్యటన కు ప్రతీకారంగా బాధ్యులైన పోలీసు అధికారులను హతమార్చడం కోసం రాష్ట్రంలోనే తొలిసారిగా నక్సల్స్ మందుపాతర పథకం రూపొందించారు.

👉 గణపతి సమీప బంధువునే తలనరికారు !

సంఘటన స్థలానికి పోలీస్ ఉన్నతాధికారులను రప్పించడానికి   నక్సల్స్ పక్క స్కెచ్ వేశారు. 28న రాత్రి బీర్పూర్  గ్రామంలో వివాద రహితుడు, 80 సంవత్సరాల మృదుడు  గణపతి సమీప బంధువు (అన్నయ్య కు  మామ ను) వంగపల్లి తిరుపతిరావు ను దారుణంగా హతమార్చి తలను మొండెంను వేరు చేశారు. సంచలం సృష్టించిన ఈ సంఘటన తీరుపై విచారణ కోసం పోలీస్ ఉన్నతాధికారులు  వస్తారని నక్సల్స్ వేసిన అంచనా నిజమైంది. పొరపాటున పేల్చిన మందు పాతర పథకం విఫలమైంది.

👉 తపాల్ పూర్ భూస్వాములు హత్య కేసులో గణపతి A -8...

👉 మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట న్యాయస్థానంలో నాటి కలమడుగు పోలీస్ స్టేషన్ లో నమోదైన తపాల్పూర్ హత్య ల ఉదాంతంలో నిందితుల పేర్లతో పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్ !

గణపతి పై ఆదిలాబాద్ జిల్లా నాటి కల మడుగు, పోలీస్ స్టేషన్ ( ప్రస్తుతం జన్నారం పోలీస్ స్టేషన్ ) లో  తపాలాపూర్ హత్యల కేసు నమోదు చేశారు.


నాటి హత్య సంఘటనలో పాల్గొన్న నక్సల్స్ లో ముప్పాల లక్ష్మణరావు @ గణపతి నాడు@ మల్లన్న గా A – 8 పోలీసులు స్థానానికి సమర్పించిన ఛార్జ్ షీట్  లో పీపుల్స్ వార్  వ్యవస్థాపకుడు,  అగ్రనేత నేత కొండపల్లి సీతరామయ్యతో పాటు,16 మంది నక్సల్స్ నాయకులపై కేసు నమోదు అయ్యింది.  క్రైమ్ నెంబర్  39 to 42/76,43)76,44/76, లొ పలు సెక్షన్లు వీరిపై నమోదు చేశారు.

👉 గణపతి అరెస్ట్  ఒకేసారి !

1977 ఆగస్టు లో ఆదిలాబాద్ జిల్లా తపాలాపూర్ భూస్వాముల హత్యాల  సంఘటనలో నిజామాబాద్ జిల్లా పరిధిలో  మెట్టుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. గణపతి మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట్ న్యాయస్థానం నుండి బెయిల్ పై బయటికి వచ్చి అజ్ఞాతం లోకి వెళ్లాడు.

👉 గణపతికి బెయిల్ ఇచ్చిన వ్యక్తిని, అతడి కుమారుడిని  కాల్చి చంపారు  !

తపాల్ పూర్ హత్యకేసులో అరెస్ట్ జైల్లో ఉన్న గణపతి కి ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన జోగినిపల్లి ప్రకాశరావు, గణపతి సమీప బందువు బీర్పూర్ కు చెందిన నారాయణరావులు బెయిల్ (జమానత్) ఇచ్చారు. బెయిల్ పై బయటకు వచ్చిన లక్ష్మణ్ రావు నేటి వరకు పోలీసులకు చిక్కలేదు.

అయితే నాడు వార్  ఈ ప్రాంతంలో చేపట్టిన సారా వ్యతిరేకు ఉద్యమానికి ఆటంకం కలిగిస్తున్నారు అనే ఆరోపణలపై , బెయిల్ కోసం గణపతికి  కోర్టులో షూరిటీ ఇచ్చిన జోగిని పల్లి ప్రకాష్ రావు  కుమారుడు, వసంతరావును 1981 అక్టోబర్ లో కాల్చి చంపారు.
1984  అక్టోబర్ లో జోగిని పెళ్లి  ప్రకాష్ రావును   జై న గ్రామ బస్టాండ్ లో కాల్చి చంపారు..

👉 కొండపల్లి సీతారామయ్య తప్పించి ..

పీపుల్స్ వార్  అంతర్గత పోరులో  నల్ల ఆదిరెడ్డి, శీలం నరేష్, ముప్పాల లక్ష్మణరావు, తదితర నాయకులలో మీరు కీలకం. వార్ ప్లీనరీలో ? నల్లమల్ల అడవులలో ? సమావేశం జరిగిందో తెలియదు కానీ పీపుల్స్ వార్ నాయకత్వ బాధ్యతల నుంచి  వార్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య ను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించారు.. రాష్ట్ర కార్యదర్శిగా ముప్పాల లక్ష్మణరావు బాధ్యతలు తీసుకున్నారు. ఈ అంశంలో వార్ అగ్ర నాయకుల మధ్య మనస్పర్ధలు సిద్ధాంతా విభేదాలు చోటు చేసుకోవడంతో కడప ప్రాంతానికి చెందిన బండయ్య మాస్టర్, జగిత్యాల్ డివిజన్ కు చెందిన మెడికో మాదాసు వేణుగోపాల్, మరి కొందరు నాయకులు గణపతి వర్గంతో విభేదించి వార్ కు దూరమై జనజీవన స్రవంతిలో కలిశారు.

👉 బీహార్ మావోయిస్టు పార్టీతో విలీనం !

ఉమ్మడి రాష్ట్ర  వార్ కార్యదర్శిగా కొనసాగుతున్న గణపతి, 2004 లో బీహార్  మావోయిస్టు పార్టీతో కలసి సిపిఐ ఎంఎల్ మావోయిస్టు పార్టీగా  రూపు దిద్దుకుంది. మోవిష్కృతి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎంపికైన గణపతి 2018 వరకు ఆ బాధ్యత నిర్వహిస్తూ దేశంలో 16 రాష్ట్రాలలో మావోయిస్టు కార్యకలాపాలను విస్తృత పరిచారు.

2018 లో ఆరోగ్య ఆరోగ్య సమస్యలో,  ఇతర కారణాలో తెలియదు కానీ, గేరిల్లా ఆర్మీ  మావోయిస్టు మిలటరీ  చీఫ్, నంబాల కేశవరావు @ బసవరాజును మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించి గణపతి తప్పుకున్నట్టు తెలిసింది. మతిమరుపు, వృద్ధాప్యం, మోకాళ్ళ నొప్పులు, అనారోగ్య సమస్యలు తదితర కారణాలతో గణపతి బాధ్యతల నుంచి గౌరవంగా తప్పుకున్నట్టు ప్రభుత్వానికి లొంగిన మావోయిస్టు నాయకుల కథనం…

👉 గణపతికి…అనారోగ్యమా ?  అందుబాటులో లేడా ?

ఉద్యమమే ఊపిరిగా, ఉరుకులు పరుగులతో ఉద్యమాన్ని పలు రాష్ట్రాలలో విస్తరింపచేసిన ముప్పాల లక్ష్మణరావు @ గణపతి అనారోగ్యంతో అవస్థలు పడుతున్నాడా ? ఆయుధ విరమణ చేసి ప్రభుత్వానికి లొంగిన తన శిష్య గణమైన అగ్రనేతలకు గణపతి అందుబాటులో లేడా ? అనేదే ప్రస్తుత చర్చ.

2017-18 లో నంబాల కేశవరావుకు బాధ్యతల కట్టబెట్టిన గణపతి నాటి నుంచి నేటి వరకు ఆయన పేరిట ఎలాంటి ప్రకటన రాలేదు.. కగార్ ఆపరేషన్ లో  దండకారణ్యం లో దళాలకు దళాలు, అగ్ర నేతలు, హతం కావడం, కీలక నేతలు, వందలాదిమంది దళ సభ్యులతో అధునాతనమైన ఆయుధాలతో ప్రభుత్వానికి వారు సరెండర్ అయినా గణపతి మౌనం వీడడం లేదు.

తన నాయకత్వంలో నిర్మితమైన మావోయిస్టు ఉద్యమం దండకారణ్య రాష్ట్రాలలో ప్రభుత్వానికి సమాంతరంగా కొనసాగిన ( జనతన) ప్రభుత్వాలు పునాదులతో సహా తన కళ్ల ఎదుటే కూలిపోతున్న,  కూలిపోయినా, గణపతి మౌనం వెనుక మర్మం  ఏమిటో ? అంతు పట్టడం లేదు.. ఆయన సమకాలికు గణపతి కదలికలు, రహస్య స్థావరాలు తెలియవా ? తెలిసినా , తమ అధినేత, విప్లవ గురు శిఖరం  గణపతితో సంప్రదింపులు జరిపి జనజీవన స్రవంతిలోకి వారు ఆహ్వానిస్తున్నారా ?  అనే అంశం మరో కొన్ని రోజులలో స్పష్టం అవుతుందో ? కాదో ? వేచి చూడాల్సిందే.