👉 గల్ఫ్ బాధితులకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది !
.
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
మైనార్టీల సంక్షేమానికి మా ప్రభుత్వం ఎన్ని లేని ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధికి కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం ధర్మపురి పట్టణ కేంద్రంలోని షాదీ ఖానాలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముస్లీం మైనారిటీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ……

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. జగిత్యాల జిల్లాలో 590 మంది మహిళలు కుట్టు మిషన్లు కావాలని దరఖాస్తు చేసుకున్నారని మంత్రి తెలిపారు.
👉 మొదటి విడతలో 590 మంది మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నామని మిగిలిన వారికి 99 రోజుల ప్రజాపాలన – ప్రణాళికలు అందజేస్తామని తెలిపారు.

👉 జిల్లాలో మైనార్టీ రుణాల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత శాఖ మంత్రి తో మాట్లాడి రుణాలు అందించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.
👉 ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలి..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

👉 ముఖ్యంగా పారిశుధ్యం అంశంతో పాటు పెండింగ్ ఫైళ్ల అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి సూచించారు. 99 రోజుల ప్రణాళికలో గ్రామ, పట్టణాలలో ఉన్న సమస్యలను పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని మంత్రి సూచించారు.
👉 గల్ఫ్ బాధితులకు అండగా..
గల్ఫ్ బాధితుల కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఉపాధి కోసం వివిధ దేశాలకు వెళ్లి అనుకోకుండా జరిగిన ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 గల్ఫ్ బాధితులను ఆదుకో వడానికి ప్రభుత్వం బాధిత కుటుంబానికి ₹ 5 లక్షలు అందజేస్తుందని మంత్రి తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలోని 15 మంది గల్ఫ్ బాధితులకు ₹ 75 లక్షలు అందజేస్తున్న మంత్రి తెలిపారు. రాష్ట్రంలో వర్గాల సంక్షేమైనా ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.

👉 జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ
ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు కుట్టు మిషన్లు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.
జగిత్యాల జిల్లా నుండి పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారాని ప్రమాదవశాత్తు అక్కడ మరణిస్తే కుటుంబం ఇబ్బందులు పడుతుందని కలెక్టర్ అన్నారు. గల్ప్ బాధితులకు ఆదుకోవడానికి జిల్లాలో ఇప్పటి వరకు 250 మందికి ఒక్కొక్కరికి ₹5 లక్షలు అందజేశామని కలెక్టర్ తెలిపారు.
ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి అన్నారు. కార్యక్రమంలో ధర్మపురి నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
