👉 ధర్మపురి లో రంజాన్ తోఫా పంపిణీ !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, దేశంలో అన్ని మతాలను, కులాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రంజాన్ పండుగ సందర్బంగా ముస్లీంలకు గురువారం ధర్మపురి పట్టణంలోని ఎస్ఎచ్ గార్డెన్ లో తోఫా పంపిణీ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ….

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లీం పేదలకు తోఫా పంపిణీ చేయాలని నిర్ణయించారని అన్నారు.
ధర్మపురి నియోజకవర్గంలోని 2050 మందికి రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా పేద ముస్లింల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.

రానున్న గోదావరి పుష్కరాలకు ధర్మపురికి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడానికి తన వంతుగా కృషి చేస్తున్నట్లు మంత్రి వివరించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి తో మాట్లాడి ధర్మపురి బస్ డిపో మంజూరు కోరకు కృషి చేస్తానని మంత్రి తెలిపారు.
గోదావరి పుష్కరాలు వరకు ధర్మపురి బస్ డిపో నిర్మాణం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు.
మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ……
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల సంక్షేమ ప్రభుత్వమని, ముస్లీం సోదర సోదరిమణులకు కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అందిస్తుందని అన్నారు.

జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుముల లావణ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గజంగి నందయ్య తో పాటు ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్లు, ముస్లీం మత పెద్దలు పాల్గొన్నారు.
