J.SURENDER KUMAR,
అనారోగ్యం, వివిధ కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను మంత్రి లక్ష్మణ్ కుమార్ శనివారం పరామర్శించి ఓదార్చారు.
గొల్లపల్లి మండలం ఎనుగుమట్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ సురిగినేని రాజేశ్వరరావు తల్లి చిన్నమ్మ ఇటీవల మరణించగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరణించిన చిన్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి ఆకాంక్షించారు.

ఎనుగుమట్ల గ్రామానికి చెందిన ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి ఇటీవల మరణించగా మంత్రి పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. మంత్రి వెంట పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
👉 బుగ్గారం లో

బుగ్గారం మండలం వెల్గొండ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండపల్లి సంతోష్ రావు తల్లి సరస్వతి ఇటీవల మరణించగా, మంత్రి అడ్లూరి రాత్రి వారి కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా సరస్వతి చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి నివాళులు అర్పించారు.
