👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.!
J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాదిగ ఉద్యోగుల పక్షాన శుక్రవారం పగలు హైదరాబాద్ లోని హైటెక్ సిటీ లోని శిల్పకళా వేదికలో ఘనంగా సన్మానించనున్నట్టు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర మాదిగ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి మాదిగ కులస్తులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో న్యాయం జరిగే విధంగా కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి సన్మాన సభకు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే మాదిగ ఉద్యోగులంతా వేలాదిగా తరలి రావాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహతో పాటు తెలంగాణ రాష్ట్ర మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు హాజరవుతున్నట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మాదిగ ఉద్యోగులు వేల సంఖ్యలు తరలివచ్చి సీఎం సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
