👉 మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ప్రస్తుతం మీడియా వేగం పెరిగినా, నిజం తగ్గకూడదనీ వేగంతో పాటు బాధ్యత అవసరం అని అన్నారు, నిజమైన జర్నలిజం అంటే వాస్తవాలను వక్రీకరించకుండా ప్రజలకు అందించడం మీడియా బాధ్యత అని పేర్కొన్నారు. “నిజం నిజంగానే చెప్పాలి” అనే ధైర్యం ప్రతి మీడియా సంస్థలో ఉండాలి అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
సౌత్ ఇండియా మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజావాహిని తెలుగు దినపత్రిక ఆవిష్కరణ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా సైమా మహిళా అవార్డులు 20 26 కార్యక్రమం హైదరాబాదులోని దస్ పల్లా హోటల్లో శనివారం సాయంత్రం జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు..

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…
సంచలనాలకు కాదు, సత్యానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యలను కేవలం వార్తలుగా కాకుండా పరిష్కారం దిశగా తీసుకెళ్లాలనీ చెప్పారు
👉 గ్రామీణ ప్రాంతాల బాధలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే వారధిగా మీడియా ఉండాలని ఆకాంక్షించారు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం మీడియా బాధ్యత అని పేర్కొన్నారు
👉 ప్రభుత్వ లోపాలను నిర్మాణాత్మకంగా వెలుగులోకి తేవాలనీ పిలుపునిచ్చారు ప్రజల సమస్యలపై నిరంతర ఫాలోఅప్ చేయడం ద్వారా పరిష్కారం సాధించాలన్నారు.
👉 మీడియా ప్రజల గొంతుక మాత్రమే కాదు, ప్రజా హక్కుల పరిరక్షకులుగా కావాలన్నారు. మహిళల భద్రత, గౌరవం అంశాలపై మీడియా సున్నితంగా వ్యవహరించాలనీ సూచించారు

👉 సోషల్ మీడియాలో వచ్చే అపోహలను చెక్ చేసి నిజాన్ని బయటపెట్టాలన్నారు. యువతను సరికొత్త దిశలో నడిపించే బాధ్యత మీడియాపై ఉందన్నారు.
👉 నైతిక విలువలు, విశ్వసనీయత మీడియా యొక్క అసలైన బలం అని చెప్పారు. ప్రజా ప్రయోజనమే పరమావధిగా మీడియా ముందుకు సాగాలనీ దిశా నిర్దేశం చేశారు
👉 ప్రభుత్వంతో సహకారం అంటే ప్రశంసలు మాత్రమే కాదు – అవసరమైనప్పుడు ప్రశ్నించడం కూడా బాధ్యతగా స్వీకరించాలన్నారు

👉 సమాజంలో మార్పు తీసుకురావడంలో మీడియా ఒక శక్తివంతమైన ఆయుధం అని పేర్కొన్నారు ప్రతి వార్త వెనుక బాధ్యత ఉండాలి, ప్రతి పదం వెనుక నిజం ఉండాలనీ తెలిపారు
👉 ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం – అదే నిజమైన మీడియా విజయమని అన్నారు తెలంగాణ ఉద్యమంలో పత్రికలు గొంతుకై రాష్ట్ర సాధనకు కృషి చేశాయని పత్రికల సేవలను. మంత్రి కొనియాడారు
👉 అక్షర చైతన్యంతో సమాజాన్ని వెలుగులోకి తీసుకువెళ్లడం మీడియా ధర్మం అని మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అరుణోదయ కళాకారుని తెలంగాణ ఉద్యమ ప్రజా గొంతుక విమలక్క, శ్రీ శ్రీ జగద్గురు సిద్ధ రామేశ్వర స్వామి భోవీ గురు పీఠ, ప్రొఫెసర్ ఖాసీం, ప్రిన్సిపల్ ఆర్ట్స్ కళాశాల ఉస్మానియా యూనివర్సిటీ, సీమ ప్రధాన కార్యదర్శి ఎన్ కె స్వామి, ప్రముఖ గాయని శ్రీలేఖ తో పాటు ప్రముఖ కళాకారులు పత్రిక ప్రముఖులు వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
