👉 వామన్ రావు నాగమణి దంపతుల హత్య కేసును విచారిస్తున్న సిబిఐ !
J.SURENDER KUMAR,
న్యాయవాద దంపతులు వామన్ రావు నాగమణి హత్య కేసులో ప్రధాన సాక్షులకు పోలీస్ యంత్రాంగం భద్రత కల్పిస్తూ చర్యలకు శ్రీకారం చుట్టినట్టు సమాచారం..
మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు నాగమణి దంపతులు మంచని కోర్టుకు హాజరై తిరిగి హైదరాబాదుకు కార్ లో వెళ్తుండగా పెద్దపల్లి జిల్లాలో రామగిరి మండలం లో ఫిబ్రవరి 17, 2021 లో నడిరోడ్డుపై న్యాయవాద దంపతులు దారుణ హత్యకు గురి అయిన విషయం తెలిసిందే..
వామన్ రావు తండ్రి, గట్టు కిషన్ రావు ,తన కొడుకు, కోడలు హత్య సంఘటనలో నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం కీలక సూత్రధారులను వదిలి పెట్టారని, నిష్పక్షికంగా దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టు లో 751 పేజీల పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆగస్టు 2025లో, హత్యల దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి బదిలీ చేసింది, ఈ విషయంలో మరింత దర్యాప్తు అవసరమని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత సంవత్సరం సెప్టెంబర్ లో సిబిఐ అధికారులు వామన్ రావు దంపతుల బంధువులను, కుటుంబ సభ్యులను, విచారించడంతోపాటు హత్యకు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.
పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన చార్జెస్ షీట్, ఎఫ్ ఐ ఆర్ కాపీలను, స్వాధీనం చేసుకొని పరిశీలించడంతోపాటు సాక్షులను పలువురు ప్రజా ప్రతినిధులను, పోలీస్ అధికారులను రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ప్రత్యేక ఛాంబర్ కు పిలిచి వాంగ్మూలాలను నమోదు చేశారు.
