J.SURENDER KUMAR,
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ఈ వేడుకలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వచనం తీసుకున్నారు.

👉 మిథిలా స్టేడియంలో జరిగిన ఈ తిరుకల్యాణ మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , కొండా సురేఖ , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , ధనసరి అనసూయ సీతక్క , వాకిటి శ్రీహరి , ఇతర ప్రజా ప్రతినిధులు, డీజీపీ శివధర్ రెడ్డి , ఉన్నతాధికారులు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు.

👉 శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ విస్తరణ కోసం తొలిదశ ₹ 351 కోట్లతో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి భూమిపూజ నిర్వహించారు.

ఇందులో ₹ 180 కోట్లతో ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, ₹96 కోట్లతో ఆలయ పరిసరాల అభివృద్ధి, ₹ 75 కోట్లతో గోదావరి ఘాట్ అభివృద్ధి వంటి పనులు చేపట్టనున్నారు.
