👉 గణపతి బంధువులకు సమాచారం లేదా ?
👉 సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ముందు 124 పి ఎల్ జి దళసభ్యుల లొంగుబాటు స్క్రోలింగ్ !
J SURENDER KUMAR,
శనివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 124 మంది పి ఎల్ జి దళసభ్యులు దేవ్ జి @ తిప్పరి తిరుపతి, దళం లొంగుబాటు అంటూ ఓ టీవీ ఛానల్ లో స్క్రోలింగ్ తో పాటు మావోయిస్టు అధినేత గణపతి సైతం లొంగిపోతున్నట్టు ఆ చానల్ లో స్క్రోల్ చేస్తున్నారు. అయితే గణపతి లొంగుబాటే చర్చనీయాంశమైంది.
గణపతి రక్తసంబంధీకులకు, బంధువులకు, పోలీస్ యంత్రాంగం నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేనట్టు తెలిసింది. వయస్సు ఆరోగ్య సమస్యలు, మారిన కాలమాన పరిస్థితుల, నేపథ్యంలో గణపతి ప్రభుత్వానికి లొంగిపోవాలని ఆయన బంధు వర్గం, రక్తసంబంధీకులతో పాటు తెలంగాణ సమాజం, మేధావులు స్వాగతిస్తున్నారు అనేది అక్షర సత్యం.
మావోయిస్టు సిద్ధాంతకర్త అగ్ర నేత ముప్పాల లక్ష్మణరావు @ గణపతి, ప్రియ శిష్యులైన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి,@ దేవుజీ @ కుమ్మా దాదా, (44 సంవత్సరాలు అజ్ఞాతం) కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజి రెడ్డి @ సంగ్రామం.(46 సంవత్సరాల అజ్ఞాతం) తెలంగాణ రాష్ట్ర కమిటీ (టీఎస్సీ) కార్యదర్శి బడే చొక్కారావు,@ దామోదర్,@ జగన్ (28 సంవత్సరాల అజ్ఞాతం) రాష్ట్ర కమిటీ సభ్యుడు (SCM) నూనె నర్సింహా రెడ్డి @గంగన్న ,@ సన్ను దాదా.(36 సంవత్సరాల అజ్ఞాతం) వీరితోపాటు మరో 40 మంది కీలక మావోయిస్టులు గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ పోలీసుల ముందు లొంగిన విషయం విధితమే. వారితో పాటు గణపతి ఏ కారణంతో సరెండర్ కాలేదు అనే అంశం కూడా చర్చలకు ఆస్కారం ఇస్తున్నది.
లొంగిన మావోయిస్టు నాయకులు డిజిపి తో కలిసి సీఎం రేవంత్ రెడ్డితో సచివాలయంలో సమావేశం కావడం, రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిజిపి, ఇంటిలిజెన్సీ అధికారులు ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షా తో సమావేశం అయిన విషయం విధితమే..
2026 మార్చి 31 నక్సలైట్ రహిత దేశంగా చేస్తానని హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ లో, బయట బహిరంగ గా ప్రకటించడంతోపాటు ఆ దిశగా కార్యాచరణకు శ్రీకారం చుట్టి దాదాపు 80%, లక్ష్యం సాధించినట్టు గణాంకాలు స్పష్టం స్పష్టం చేస్తున్నాయి. మార్చి 31 డెడ్ లైన్ కు కేవలం మరో 20 రోజులు మాత్రమే సమయం ఉంది.. ఈలోగా భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం సాధించవచ్చు.
👉 124 పి ఎల్ జి సభ్యుల లొంగబాటు !
నేటి సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 124 మంది పి ఎల్ జి దళ సభ్యులు పెద్ద ఎత్తున ఆయుధాలతో సరెండర్ కావడం వాస్తవమే కావచ్చు.. వీరితోపాటు కీలక మావోయిస్టు నాయకులు, పాపారావు, చెల్పూరు సత్తన్న, మరో ఇద్దరు ఉన్నట్టు సమాచారం..
