👉 ప్రత్యేక మొబైల్ యాప్‌తో 99 రోజుల కార్యక్రమల పర్యవేక్షణ !
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
రాష్ట్రంలో మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రభుత్వం నిర్వహించనున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని అయిదు దశల్లో నిర్వహించడానికి వీలుగా కార్యాచరణ రూపొందించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను వినియోగించనున్నారు.
👉 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన అన్ని శాఖల కార్యదర్శులు, కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి కార్యాచరణపై సమగ్రంగా దిశానిర్దేశం చేశారు.
👉 5 దశల్లో కార్యాచరణ:
ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ, ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమాలు, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు, మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమాలు, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.
👉 99 రోజుల కార్యక్రమంలో చేపట్టనున్న 10 వివిధ అంశాలు:
1. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత. ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ 2. ఆరోగ్యం 3. అరైవ్ – అలైవ్ 4. సంక్షేమం 5. పిల్లల భద్రత – డ్రగ్స్‌కు అడ్డుకట్ట 6. రైతు సంక్షేమం – వ్యవసాయం 7. విద్య 8. యువత – క్రీడలు 9. మహిళలు 10. పర్యావరణం
👉 మార్చి 6న అన్ని ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. 99 రోజుల్లో శాఖల వారీగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
