👉 నేడు సిద్దిపేట జిల్లాలో ₹ 775.72 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు !
J.SURENDER KUMAR,
ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి రాష్ట్ర రైతులకు అంకితం చేయనున్నారు. దీంతో పాటు రిఫైనరీ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
వీటితో పాటు సిద్ధిపేట జిల్లాలో ₹ 775.72 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి మంత్రులతో కలిసి శంకుస్థాపన చేస్తారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతారు. అక్కడే పెట్టుబడి సాయం రైతు భరోసా నిధులను విడుదల చేస్తారు.
👉 సిద్ధిపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు – ప్రారంభోత్సవాల వివరాలు !
👉 ₹ 300 కోట్లతో నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం.
👉 ₹ 141.34 కోట్లతో సిద్దిపేట మున్సిపాలిటీలో నీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టులకు శంకుస్థాపన.
👉 ₹ 78 కోట్లతో ఎన్సాన్‌పల్లిలో జిల్లా జైలు భవనం ప్రారంభోత్సవం.
👉 ₹ 15 కోట్లతో ఎన్సాన్‌పల్లిలో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రి ప్రారంభోత్సవం.
👉 ₹ 3.60 కోట్లతో ఎన్సాన్‌పల్లిలో సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ప్రారంభోత్సవం.
👉 ₹ 1.43 కోట్లతో నంగునూరు మండలం గట్లమల్యాలలో PHC భవనం ప్రారంభోత్సవం.
👉 ₹.1.43 కోట్లతో సిద్దిపేట మున్సిపాలిటీలోని అంబేద్కర్ నగర్ లో నిర్మించిన UPHC భవనం ప్రారంభోత్సవం.
👉 గజ్వేల్ నియోజకవర్గంలో శంకుస్థాపనలు / ప్రారంభోత్సవాల వివరాలు:
👉 ₹.200 కోట్లతో కొండపాకలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన.
👉 ₹.16.62 కోట్లతో మర్కూక్‌లోని తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో అదనపు మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన.
👉 ₹ 8.65 కోట్లతో మర్కూక్‌లో సమీకృత మండల కార్యాలయాల సముదాయం (IOC) ప్రారంభోత్సవం
👉 ₹ 9.65 కోట్లతో జగదేవ్‌పూర్‌లో సమీకృత మండల కార్యాలయాల సముదాయం (IOC) ప్రారంభోత్సవం.
