👉 30 సంవత్సరాల తెగని సమస్యకు ముగింపు!
👉 ధర్మపురి నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా అభివృద్ధి చేస్తా !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..
J.SURENDER KUMAR,
పది సంవత్సరాలగా ప్రతిపక్షంలో ఉంటు ధర్మపురి నియోజకవర్గంలోని అనేక ప్రజా సమస్యలపై అవగాహన ఉండి ప్రజాక్షేత్రంలో రాజీలేని పోరాటం చేశానని, నియోజకవర్గంలో 30 సంవత్సరాలుగా తెగని సమస్య ముగిసిందని, సమస్యలను ఒక్కటోక్కటిగా పరిష్కరిస్తు ధర్మపురి నియోజకవర్గ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి నా శక్తి మేరకు కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 ధర్మపురి పట్టణంలోని మంత్రి లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాలయం లో శుక్రవారం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు.
ధర్మపురి పట్టణంలో ఇళ్లపై ప్రమాదకరంగా ఉన్న 11కేవీ విద్యుత్ లైన్ తో వందలాది మంది గృహస్తులు గత 30 సంవత్సరాలుగా ఇంటిపై మరో నిర్మాణం చేయలేక, ఇంటి దాబా పైకి వెళ్లలేక అనేక ఇబ్బందులు పడ్డారని, మంత్రి తెలిపారు..
👉 గత ప్రభుత్వంలో ఇంటిపై విద్యుత్తు లైన్లు తొలగింపుకు విద్యుత్ శాఖ వారు లక్షలాది రూపాయల, డీడీలు, చాలాన్ లు ఇంటి యజమానులే చెల్లించాలని నిబంధనలు పెట్టారు అని అన్నారు. ప్రతి ఇంటి యజమాని కనీసం ₹ 40 వేల నుండి ₹ 50 వేలు చెల్లించే ఆర్థిక స్తోమత లేక గత 30 సంవత్సరాలుగా సమస్యకు పరిష్కారం లభించలేదన్నారు.
👉 ప్రజా పాలన ప్రభుత్వంలో ఇంటి యజమానులపై ఒక రూపాయి ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వ పక్షాన 11 కెవి విద్యుత్ లైన్ లో తొలగింపు కోసం సీఎంఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఇంటి యజమానుల ఆర్థిక పరిస్థితిని వివరించానని మంత్రి తెలిపారు.
👉 ధర్మపురి పట్టణంలో 11 కేవీ విద్యుత్ లైన్ తో 110 కుటుంబాలు ఇబ్బంది పడేవని మంత్రి అన్నారు. శ్రీరాములపల్లి నుండి ధర్మపురి వరకు 11కేవీ లైన్ షిఫ్టింగ్ చేయడంతో అనేక మందికి ఉపయోగం కలిగిందని మంత్రి తెలిపారు.

👉 ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ₹ 4.60 కోట్లతో విద్యుత్ లైన్స్ షిఫ్టింగ్ అవుతున్నాయని మిగిలిన గ్రామాల్లో సైతం విద్యుత్తు లైన్ల షిఫ్టింగ్ పనులు పూర్తి చేసి నియోజకవర్గంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
👉 విద్యుత్ తీగలు తొలగింపు పనులు పూర్తి కావడంతో నూతన ఏర్పాటు చేసిన 11కేవీ లైన్ ను మంత్రి లక్ష్మణ్ కుమార్ పట్టణంలోని కమలాపూర్ రోడ్డులో ప్రారంభించారు..
