ప్రజలు ఓట్లు వేయలేదని నవోదయను రద్దు చేశారు !

👉 కలిసి పని చేస్తే అభివృద్ధి సాధ్యం  అభివృద్ధి నా ప్రధాన ఎజెండా!

👉 జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ !

J.SURENDER KUMAR,

జగిత్యాల ప్రజలు ఓట్లు వేయలేదని ఎంపీ  చిన్న చూపు చూస్తున్నారు, అందువల్లనే నవోదయ పాఠశాలను రద్దుచేసి కోరుట్ల కు కేటాయించారు కలిసి పని చేస్తే అభివృద్ధి సాధ్యం జగిత్యాల అభివృద్ధి నా ప్రధాన ఎజెండా అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రం మోతే రోడ్డు పార్టీ కార్యాలయం లో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఎంపీ అరవింద్  కేంద్రీయ విద్యాలయం విషయం లో ఎమ్మెల్యే సంజయ్ కాలయాపన చేస్తున్నారు అని విమర్శించారు.నన్ను పనిగట్టుకొని బద్నాం చేయాలనీ,ఈర్ష్యా తో కూడిన మాటలు మాట్లాడటం, నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారు అని ఎమ్మెల్యే ఆరోపించారు.

జగిత్యాల ప్రజలు నన్ను  గెలిపించారు ఆది వారికి వారి అనుచరులకు నచ్చక కావాలని నాపై పచ్చి అబద్ధాలు మాట్లాడడాన్నీ పూర్తిగా ఖండిస్తున్నా అన్నారు.

జగిత్యాల అభివృద్ధి పనులతో నేను సమాధానం చెప్తా, ఎప్పుడూ ప్రెస్ మీట్ లు పెట్టీ విమర్శించడం నా నైజం కాదు. ట్యాక్స్ లేని మాటలు ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు.

జగిత్యాల పట్టణం అభివృద్ధి నా ప్రధాన ఎజెండా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి గత ఏడాది నవంబర్ 2025 లో కేంద్రీయ విద్యాలయం స్థలం కోసం లేఖ రాయడం జరిగింది. మంత్రి  ఎండార్స్ చేసిన పత్రాలు సైతం వాట్సాప్ కూడా చేస్తా,ఎలాంటి ఫోర్జరీ లేదు అవసరమైతే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపవచ్చు. అన్నారు.

ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ కేంద్రీయ విద్యాలయం మినీ స్టేడియం కు స్థలం ఇవ్వాలని జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ,ముఖ్యమంత్రి కి సైతం వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. కొన్ని సార్లు పనుల్లో జాప్యం జరుగుతుంది అంత మాత్రాన వ్యక్తి కేంద్రంగా విమర్శ చేయడం తగదు అన్నారు.

ఎంపీ  మాటలు వారి విజ్ఞత కి వదిలేస్తున్న..
కేంద్రీయ విద్యాలయం విషయం లో నేను చేసిన ప్రతి పని పూర్తి ఆధారాలతో ఉన్నాయి. సోషల్ మీడియా యుగం లో ఎది దాచాలన్నా ఏదీ దాగదు అన్నారు.

చల్గల్ వాలంతరీ లో దాదాపు ఇంకా 80 ఎకరాలు భూమి ఉంది. ఇంటిగ్రెటెడ్ స్కూల్ కి టెండర్ ప్రక్రియ పూర్తి అయింది కాంట్రాక్టర్ కూడా రెడీ గా ఉన్నాడు. కేంద్రీయ విద్యాలయం టెండర్, కాంట్రాక్ట్ గురించి తనకు సమాచారం లేదు ఎవరో తెలియదు. సిద్ధంగా ఉన్న ఇంటిగ్రెటెడ్ స్కూల్ కి స్థలం విషయం లో కొంత ఆలస్యం తో విద్య సంస్థల ఏర్పాటు కోసం విద్యార్థుల విద్య కోసం నిరంతరం పని చేస్తున్నా అన్నారు.

కేంద్రీయ విద్యాలయం నుండి కలెక్టర్  దృష్టికి స్థలం విషయంలో ఆర్డీవో చల్గల్ వాలాంతరి స్థలం మ్యాప్ తో సహా సర్వే చేసి 5 ఎకరాలు పంపడం జరిగింది అన్నారు.

మంత్రులను ముఖ్యమంత్రి ని స్థలం విషయం లో పలుమార్లు కోరడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశించారు. కొంత ఆలస్యం అవడం సహజం.

ఆర్టికల్275 కింద గిరిజనులకు రావాల్సిన నిధులు కేంద్ర మంత్రిని గతం లో కోరగా ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయలేదు
అన్నారు.

జగదల్ పూర్ నిజామాబాద్  జాతీయ రహదారి అనంతారం బ్రిడ్జి మరియు రాయికల్ సింగరావు పెట్ బ్రిడ్జి విషయం లో నిధులు మంజూరు చేయాలని ఎంపీని కోరగా నిధుల మంజూరుకు
జాప్యం ఎందుకు చేస్తున్నారు అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

కలిసి పని చేస్తే అభివ్రుద్ది సాధ్యం అంతేకాని విమర్శ లు చేయటం సరికాదు.. జగిత్యాల నియోజకవర్గ అన్ని వర్గాల ప్రజలకు మీ వంతుగా కేంద్రం నుండి నిధులు మంజూరు కోసం ఎంపీగా కృషి చేయాలి…

కేంద్రీయ విద్యాలయం విషయం లో రాజకీయాలు చేయడం బాధాకరం అన్ని వర్గాల వారు కలిసి నన్ను గెలిపించారు సేవా కోసమే ప్రజలలోకి వచ్చా వ్యక్తి గత దూషణలు రాజకీయాలకు మంచిది కాదు అన్నారు.

మాజీ మున్సిపల్ చైర్మన్ బొగ శ్రావణి బి అర్ ఎస్ ఛైర్మెన్ గా ఉండి 6 నెలలు ఎంపీ తో చర్చలు జరిపి బీజేపీ లో చేరారు అని ఎంపీ  అన్నారు. ప్లాన్ ప్రకారం నాపై వ్యక్తిగత దూషణలు మాజీ ఛైర్మెన్ చేశారు అని నేడు తెలిసింది అన్నారు.

ముఖ్యమంత్రిని చదువు లేదని, ఏమి తెలియదని విమర్శించిన ఎంపీ  ప్రధాన మంత్రి ఎంత వరకు చదివారు చెప్పాలి ,మోడి జి నీ చాయ్ వాలా అని పిలిస్తే  కానీ అలా పిలుస్తామా ? మేము హుందాగా ఉంటాం అని ఎంపీ ని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్మన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ లు గిరి నాగభూషణం, అడువల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ పర్వీన్ మున్నా, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భీరం రాజేష్,TPCC NRI సెల్ చాంద్, నాయకులు గట్టు సతీష్, క్యాదసు నాగయ్య, బాలే శంకర్, తోట మల్లికార్జున్, అహమ్మద్, చందా పృథ్వీ, బద్దం జగన్ మోహన్ రెడ్డి, బోడ్ల రాజు, కొలగాని సత్యం, మ్యానపురిమహేష్, కయ్యుం, కుసరి అనిల్, కౌన్సిలర్ లు దుమాల రాజ్ కుమార్, సాయి కిరణ్, ఏనుగుల రాజు, శ్రీనివాస్, శ్రీరామ్ భిక్షపతి, రామకృష్ణ రెడ్డి, రాజు, తదితరులు పాల్గొన్నారు.