👉 నల్గొండ జిల్లా ఇన్ చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక అమలులో నల్గొండ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని నల్గొండ జిల్లా ఇన్ చార్జీ మంత్రి, రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవన్ లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక పై నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా సన్నహక సమావేశంలో పాల్గొని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..
👉 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు, గ్రామాలలో ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు.

👉 రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక పేరుమీద ముఖ్యమైన 10 అంశాల వారిగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని ,పరిసరాల పరిశుభ్రత, పెండింగ్ ఫైల్ పరిష్కారంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా పెండింగ్ ఫైల్స్ ను సైతం పరిష్కరించాలన్నారు.
👉 రైతులకు సంబంధించిన అంశాలు, సంక్షేమ కార్యక్రమాలు, మహిళలు, చిన్నపిల్లల భద్రత, రోడ్డు ప్రమాదాలు తదిత అంశాలపై ప్రజలకు స్పష్టంగా అవగాహన కల్పించాలని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు.
👉 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బిల్లులన్ని సోమవారం లోపు రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేయనుందని మంత్రి వెల్లడించారు. ఏప్రిల్ నుండి మరో విడత ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు.

👉 రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలాన్ని ప్రజలకు చేరాల్సిన అవసరం ఉందని, అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పథకాలను పేద ప్రజలకు అందేలా చూడాలని, అధికారులను కోరారు..
👉 ప్రభుత్వ ఆదేశాలను ఎవరు ఉల్లంఘించవద్దని, ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక అమలుపట్ల నిర్లక్ష్యం వహించవద్దని, ప్రభుత్వం పేద ప్రజల కోసం రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతు బీమా, రైతు భరోసా వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, ఇవన్నీ కూడా ప్రజల వద్దకు నేరుగా వెళ్లేలా కార్యక్రమాలు రూపొందించడం జరిగిందని తెలిపారు.
👉 షెడ్యూల్ తేదీల వారీగా కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, అధికారులు అందరూ బాధ్యతతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక వాట్సాప్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, మంత్రి లక్ష్మణ్ కుమార్ వివరించారు..

👉 కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని, అలాగే జిల్లా కలెక్టర్లు సైతం కార్యక్రమాన్ని ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని, ఏ రోజు చేసిన కార్యక్రమాలు ఆ రోజు నివేదిక రూపంలో రూపొందించాలని చెప్పారు.
👉 కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ నెల్లికంట సత్యం, శంకర్ నాయక్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నల్గొండ మేయర్ చైతన్య బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
