👉 పుష్కరాల ఏర్పాట్ల సమీక్షలో మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
రానున్న గోదావరి పుష్కరాలు రాష్ట్రానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆధ్యాత్మిక కార్యక్రమమని పుష్కరాల ఏర్పాట్లలో భూసేకరణ వేగవంతం చేయండి భూ యజమానులతో సమరస్యంగా చర్చలు జరపండి అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దుల, వికలాంగుల మరియు ట్రాన్స్ జెండర్ సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల నేపథ్యంలో చేపట్టాల్సిన భూసేకరణ (ల్యాండ్ అక్విజిషన్) మరియు దేవాలయ అభివృద్ధి పనులపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సమీక్ష సోమవారం సమావేశం నిర్వహించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని పేర్కొన్నారు. అందువల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
రానున్న గోదావరి పుష్కరాలు రాష్ట్రానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆధ్యాత్మిక కార్యక్రమమని తెలిపారు. పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని పేర్కొన్నారు. అందువల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
పుష్కరాలకు అవసరమైన భూముల సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఆదేశించారు.
👉 జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ…
2027 గోదావరి పుష్కరాల సందర్భంగా ధర్మపురి క్షేత్రానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. ఘాట్లు, రహదారులు, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, పారిశుధ్యం, భద్రత వంటి మౌలిక సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పుష్కరాల ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ చైర్‌పర్సన్ నాగలక్ష్మి, దేవాలయ ఈఓ, శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్ మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
