👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
హైదరాబాద్ కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొనసాగించాలని ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పీఠం భూములు జల మండలికి కేటాయించిన నేపథ్యంలో అక్కడ సాగుతున్న నిర్మాణ పనుల విషయాలను పీఠం ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
👉 ఈ అంశంపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కోకాపేట భూముల్లో పీఠం ఆధ్వర్యంలో వివిధ నిర్మాణాల తాజా స్థితిని తెలుసుకున్నారు. పీఠం భూములను జలమండలికి కేటాయించే సమయంలో నిర్మాణాల స్థితిని తెలియజేయకపోవడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
👉 జల మండలికి కేటాయింపులు రద్దు చేసి శారదా పీఠానికే ఆ భూములు కొనసాగించాలని ఆదేశించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ను కలిసి నిర్మాణాలు, ఇతర పరిస్థితులను వివరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, పీఠం ప్రతినిధులకు సూచించారు.
