శాసన సభాపతి హోదా సాదా సీదా జీవనం !

👉 స్వర్గీయ శ్రీపాదరావు నిస్వార్థ రాజకీయ నైజం !

👉 నేడు శ్రీపాద రావు  89వ జయంతి !

👉 శ్రీపాదరావు తో అభినందనల అనుభూతి నేపథ్యంలో …

J.SURENDER KUMAR,

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  శాసనసభాపతి హోదా లో ఉండి సాదాసీదా జీవన పయనం స్వర్గీయమాజీ స్పీకర్ దుద్ధిల్ల శ్రీపాదరావు నిస్వార్థ రాజకీయ నైజానికి నిదర్శనం..అర్ధాంతంగా వచ్చి పోయే రాజకీయ పదవుల కన్నా ఆత్మీయ ఆప్యాయతలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా స్థానం పొంది ఉన్న  కొందరిలో ఓ ప్రముఖుడు స్వర్గీయ శ్రీపాదరావు .

హంగు ఆర్భాటాలకు ఆమడ దూరంలో  ఉండి, సామాన్య మండల స్థాయి జర్నలిస్టు గా కొనసాగుతున్న  నన్ను భుజం తట్టి ,కరచాలనం చేసి, అభినందిస్తూ , నిజాలు రాయాలి,  ప్రజల రైతుల కష్టాలు ప్రభుత్వానికి తెలియజేయాలంటూ  స్వర్గీయ మాజీ స్పీకర్  దుద్ధిల్ల శ్రీపాదరావు చే అభినందనలు ,ప్రశంసలు పొందిన  అనుభూతి నేపథ్యంలో ఆయన 89 జయంతి సందర్భంగా….

ధర్మపురి పట్టణంలో1993 ఫిబ్రవరి మొదటి వారంలో  నాటి స్థానిక బుగ్గారం (శాసనసభ్యులు హోదాలో ) దేవాదాయ శాఖ మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు  స్వర్గీయ శ్రీపాదరావు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటి స్థానిక మండల విద్యాధికారి నరసింహారెడ్డి స్వాగతం ఉపన్యాసం చేశారు. స్వర్గీయ జువ్వడి రత్నాకర్ రావు,  నేను రాసిన ఓ వార్త కథనం గూర్చి రత్నాకర్ రావు, శ్రీపాదరావు వివరించారు, ఈ సందర్భంగా శ్రీపాదరావు  అభినందించారు.

1993 ఫిబ్రవరి మొదటి వారంలో స్వర్గీయ శ్రీపాదరావు అభినందిస్తున్న దృశ్యం ( ఫైల్ ఫోటో)

శ్రీపాదరావు రాజకీయ ప్రస్థానంలో అపాదా మస్తకం. తన మంథని నియోజకవర్గంతో పాటు, తెలంగాణ ప్రాంతం అభివృద్ధి పట్ల ఆరాటపడే తత్వం, నైతిక విలువలకు నిలువెత్తు నిదర్శనం ఆయన రాజకీయ జీవనం. అత్యున్నత పదవులు అలంకరించిన, ఆయన తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం అహర్నిశలు పాటుపడే పోరాట పటిమ తత్వం ఆయనది.

👉 38 సంవత్సరాల క్రితమే అసెంబ్లీలో తెలంగాణ వాదం వినిపించారు !

గోదావరి నది పుష్కరాలు అంటే ఆంధ్ర ప్రాంతం రాజమండ్రి లోనే కాదు, మా తెలంగాణ లో గోదావరి నది ప్రవహిస్తుంది. ఇక్కడ గోదావరి నదికి పుష్కరాలు జరుగుతాయి. ఈ పుష్కరాలను  ( మేము పర్వాని అంటాము )  అంటూ బాసర, ధర్మపురి, మంథని ,కాలేశ్వరం పుణ్యక్షేత్రాల గుండా గోదావరి నది ప్రవహిస్తుందని  శాసన సభాపతి హోదాలో  స్వర్గీయ శ్రీపాదరావు,  అప్పటి  ముఖ్యమంత్రిని డిమాండ్ చేసి 1991 పుష్కర నిధులను  తెలంగాణకు కేటాయించాల్సిందే అని నాటి ధర్మపురి (బుగ్గారం) ఎమ్మెల్యే స్వర్గీయ మాజీమంత్రి జువ్వడి రత్నాకర్ రావు తో కలిసి ప్రభుత్వాన్ని నిలదీశారు. 

👉 ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు మొదటిసారి పుష్కర  నిధులు !

ఉమ్మడి రాష్ట్రంలో మొదటిసారి తెలంగాణ ప్రాంతానికి ప్రభుత్వం ద్వారా పుష్కర నిధులు సాధించిన, సాధన సూర్యుడు శ్రీపాదరావు. ఆ నిధులతో ధర్మపురి, మంథని ,కాలేశ్వరంలో సిమెంట్ రోడ్లు, భక్తుల సౌకర్యార్థం తడుకల పందిళ్లు, ఆలయాలకు రంగులు వేయించారు.

👉 పుష్కర స్నానాలు ఇక్కడే..

పుష్కరాల్లో రాజమండ్రి గోదావరిలో పుష్కర స్నానం చేయకుండా, ధర్మపురి కాలేశ్వరం మంథని నది తీరాల్లో తమతో పాటు పలువురు ప్రముఖులను పుష్కర స్నానాలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రాంతానికి స్వర్గీయ శ్రీపాదరావు, జువ్వడి రత్నాకర్ రావు  ఆహ్వానించి  తెలంగాణ ప్రాంతంలోని పుణ్యక్షేత్రాల విశిష్టత ను వారికి వివరించారు.

👉 సామాన్య భక్తుడిలా…

12 రోజులపాటు తన వెన్నంటి సెక్యూరిటీ ( అంగరక్షకులు) లేకుండా ఈ నది తీర ప్రాంతంలో జరిగిన ధార్మిక కార్యక్రమాల్లో శ్రీపాద రావు భక్తజనంతో కలసి సామాన్య భక్తుడిలా పాల్గొన్నారు. పుష్కర నిధులతో చేపట్టిన పనులను నాటి ఎమ్మెల్యే స్వర్గీయ మాజీ మంత్రి జువ్వడి రత్నాకర్ రావు తో కలిసి ప్రారంభించారు.

👉 శ్రీపాదరావు గూర్చి….

భూపాల్ పల్లి జిల్లా కాటారం మండలం దన్వాడ గ్రామంలో 1935 మర్చి 2 న మౌళి పటేల్ రాధాకృష్ణయ్య కమల భాయ్ దంపతులకు శ్రీపాదరావు జన్మించారు. నాగపూర్ లో న్యాయ విద్యనభ్యసించారు.


తెలుగుదేశం పార్టీ ప్రభంజనం లో 1983 నుంచి  మూడుసార్లు మంథని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దట్టమైన కి కారణ్యం , పీపుల్స్ వార్ నక్సల్స్ ప్రాబల్యం గల. మంథని నియోజకవర్గంలో. సాగు, తాగు నీటి సమస్యలతో పాటు విద్యా, వైద్య సదుపాయలు, రహదారుల అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పన కోసం పట్టు పురుగుల పెంపక కేంద్రం తదితర అభివృద్ధి పనులు నక్సల్స్ ప్రాంతంలో చేపట్టిన ఘనత శ్రీపాదరావు ది.

👉 రెండుసార్లు ధన్వాడ సర్పంచ్ గా….

మహాదేవపూర్ సమితి బ్లాక్ ఉపాధ్యక్షుడిగా, ఎల్ఎంబి చైర్మన్ గా నిరంతరం ప్రజాక్షేత్రంలో మమైకమైన 1983 లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలోనూ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

👉 స్వర్గీయ మాజీ ప్రధాని పివి కుటుంబంతో..

భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి. పీవీ నరసింహారావు తో కుటుంబ పరంగా రాజకీయంగా, స్నేహ సంబంధాలు ఉన్నాయి ఆధునిక వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు పట్ల ఈ ప్రాంత రైతాంగాన్ని చైతన్య పరచడం కోసం శ్రీపాదరావు ఎనలేని  కృషి చేశారు.

👉 బుచ్చి పంతులు’ గా..….

మంథని నియోజకవర్గ ప్రజలు శ్రీపాదరావు ను  బుచ్చి పంతులు’ అని ప్రేమగా పిలుస్తారు.. రాజకీయ పరంగా శ్రీపాదరావును వ్యతిరేకించే వారిని సైతం ఆయన పలకరించేవారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కనీసం ఇరువది మందిని పేరు పేరునా పిలిచే  స్నేహ సంబంధాలు కలిగి ఉన్న శ్రీపాదరావు. అజాతశత్రువుగా గుర్తింపు పొందారు.

👉 ప్రాణాలు కాపాడిన వర్గమే ప్రాణం తీశారు !

నక్సల్ కార్యకలాపాలకు స్థావర కేంద్రమైన మంథని నియోజక వర్గం లో నిత్యం పోలీసులకు నక్సలైట్ కార్యకలాపాల మధ్య నరకయాతన అనుభవిస్తున్న అమాయక ప్రజలను నక్సల్స్ సానుభూతిపరులను, పోలీస్ కేసులు, వారి చిత్రహింసల నుంచి వేలాది మందిని కాపాడిన శ్రీపాదరావు ను ఆ నక్సల్స్  నాయకులే కర్కశంగా కాల్చి చంపడం  నక్సలైట్ ఉద్యమ చరిత్రలో ఓ మాయని మచ్చగా ప్రజాస్వామ్యవాదులు, నక్సల్స్ సానుభూతిపరులు, మిలిటెంట్లు, నేటికీ చర్చించుకుంటారు.

👉 అపార నమ్మకం  విశ్వాసం !

స్వర్గీయ శ్రీపాదరావుకు తన నియోజకవర్గ ప్రజానీకం, ప్రాంతం పట్ల ఏనలేని  అపార నమ్మకం  విశ్వాసం ,ప్రేమాభిమానాలు అధికం. మూడుసార్లు గెలిచిన శ్రీపాదరావు. గన్ మెన్ లు లేకుండా తన నియోజకవర్గ లో  రాత్రి పగలు మారుమూల అటవీ గ్రామాలలో  పర్యటించేవారు.  స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో ప్రభుత్వ ఎస్కార్ట్ వాహనం, గన్ మెన్లు ఆయన వెంట ఉండేవి.

ఓ కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి కి దట్టమైన అటవీ గ్రామం మహాదేవపూర్ మండలం  అన్నారం కు  1999 ఏప్రిల్ 13న శ్రీపాదరావు అడవి మార్గం గుండా వెళ్లారు. ఆ దారిలో నక్సలైట్లు శ్రీపాదరావు ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. ‘మా సమస్యల గురించి మీతో మాట్లాడాలి’ మాతో మీరు ఒంటరిగా రావాలని శ్రీపాదరావు నక్సలైట్లు కోరారు. 

ఆయన వెంట ఉన్న అనుచరులను మీరు రావద్దని ఆదేశించారు. అనేక సందర్భాల్లో పలువురు నక్సల్స్ సానుభూతిపరులను, మిలిటెంట్లను పోలీస్ స్టేషన్, కేసుల నుంచి, శ్రీపాదరావు విడిపించారు. ఈ నేపథ్యంలో సార్ తో నక్సల్స్ మాట్లాడుతారని అనుచరులు అక్కడ ఆగిపోయారు.

కొన్ని గంటల వ్యవధిలోని శ్రీపాదరావు ను హతమార్చిన సమాచారం బయటికి ప్రపంచానికి తెలిసింది. అప్పటి కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం చంద్రబాబు నాయుడు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి శ్రీపాదరావు పార్టీవదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు.


👉 రాజకీయాలకు దూరం ఆయన కుటుంబం.!

శ్రీపాదరావు రాజకీయ రంగంలో  ఉన్నంతకాలం ఆయన కుటుంబ సభ్యులు, కుమారులు రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. 1991 ఆగస్టు నుంచి, జనవరి 1995 , వరకు ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్ గా శ్రీపాదరావు కొనసాగారు.

👉 రాజకీయ వారసుడు మంత్రి శ్రీధర్ బాబు..

శ్రీపాదరావు మరణాంతరం ఆయన కుమారుడు  శ్రీధర్ బాబు న్యాయవాద వృత్తి వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. 1999, 2003, 2009, 2018, 2024 ఎన్నికల్లో మంథని ఓటర్లు శ్రీధర్ బాబు ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వంలో శాసనసభ వ్యవహారాలు మంత్రిగా కొనసాగారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రిగా కొనసాగుతున్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఇంటి ఇలవేల్పు, శ్రీ
దత్తాత్రేయ స్వామి వారి ఇష్ట దైవం !

👉 శ్రీపాదరావు జయంతి స్టేట్ ఫంక్షన్..

శ్రీపాదరావు జయంతి ని మార్చి 2 న స్టేట్ ఫంక్షన్ గా నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ 295 ద్వారా 2024 లో ఉత్తర్వులు జారీ చేసింది.