👉 మా ప్రభుత్వం 200 శాతం మెసేజ్ చార్జీలు పెంచింది !
J SURENDER KUMAR,
శాసనమండలిలో మంగళవారం ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్, శాసనమండలి సభ్యులకు ఎస్సీ ఎస్టీ గురుకుల విద్యార్థులకు మెస్, కాస్మోటిక్, చార్జీలు పెంచడం వారి సంక్షేమం గూర్చి చేపడుతున్న వివరాలను వివరించారు..
👉 అధ్యక్షా
ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వం లో ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం చేయని విధంగా సుమారు మా ప్రభుత్వం 200 శాతం మెస్ బిల్లు పెంచడం జరిగింది అధ్యక్షా.
👉 అధ్యక్షా,
ఏదైతే గౌరవ సభ్యులు చెప్పిన విధంగా మెస్ చార్జీలు కానీ, కాస్మెటిక్ చార్జీలు కానీ, ఇప్పుడు ఏదైతే మార్చి 31 వరకు మొత్తం ఎంటైర్ ఎస్సీ గురుకులాలకు సంబంధించినవన్నీ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది .
👉 అధ్యక్షా.
వారు నిన్నటి ఈ మధ్యకాలంలో వారు ఇన్ఫర్మేషన్ తీసుకోనట్టున్నారు అధ్యక్షా. నేను ఏదైతే ఎంటైర్ సోషల్ గురుకులాలకు సంబంధించిన విషయం లో దానికి మెనూ కూడా ఇచ్చాము .
👉 అధ్యక్షా…
సోమవారం రోజు ఏ మెనూ పెడుతున్నాము, మంగళవారం ఏ మెనూ పెడుతున్నాము అనేది గురుకులాలకు సంబంధించిన పిల్లలకు మంచి ఆహారం ఉండాలని, అన్ని విధాలా కూడా పిల్లలకు గొప్పగా ఉండాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న సందర్భం లో. కాస్మెటిక్ చార్జీల విషయంలో గాని, మెస్ చార్జీల విషయంలో గాని గౌరవ ముఖ్యమంత్రి తో ద్వారా అదే విధంగా ఫైనాన్స్ మినిస్టర్ తో కూర్చొని, నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మా పెండింగ్ బిల్లులన్నీ కూడా ప్రతి నెలా ఒకటవ తారీఖు నుంచి ఏడవ తారీఖు లోపు వచ్చే విధంగా, రేపు మార్చి 31 వరకు అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది అని మీ ద్వారా తెలియజేస్తున్నాను.
👉 అధ్యక్షా
అదేవిధంగా గురుకులాలకు సంబంధించిన విషయం లో, మా జిల్లా కలెక్టర్ కు ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్షా. జిల్లాకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ప్రతి వారు కూడా ఆ నియోజకవర్గంలో ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ గాని, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలను విజిట్ చేయాలి, ఒక నైట్ హాల్ట్ అక్కడ పడుకోవాలి పిల్లలతోటి. పిల్లలకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకోవాలి, వారికి ఉన్న మెనూ కు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి, ఫ్యాకల్టీ కి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి… ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి ఈరోజు మా శాఖ ద్వారా మా సొసైటీకి సంబంధించిన ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒత్తిడి కూడా వచ్చిందనే విషయాన్ని కూడా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను.
👉 అధ్యక్షా ..
మరి ఎడ్యుకేషన్ కు గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వం లో శాఖ వారి దగ్గర ఉంది. ఈరోజు మీ అందరికీ తెలుసు, మొన్న బడ్జెట్ కు సంబంధించిన దాంట్లో… మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల లో అన్ని గ్రామీణ ప్రాంత ప్రజలంతా కూడా ప్రభుత్వ పాఠశాలకు రావాలని, వారికి టిఫిన్ గాని లంచ్ గాని ఉండాలనే ఉద్దేశంతో గొప్పగా బడ్జెట్ లో ప్రవేశపెట్టిన విషయాన్ని కూడా మనవి చేస్తున్నాను. మరి గౌరవ సభ్యులకు మనవి చేస్తున్నాము, గురుకులకు సంబంధించిన విషయం లో అతి త్వరలో గవర్నింగ్ బాడీ మీటింగ్ ద్వారా ఇక ప్రత్యేకమైనటువంటి ఏ విధంగా గురుకులాలను స్ట్రెంథెన్ చేయాలి అనే విషయం లో ముందుకు వెళ్తాము అధ్యక్షా. థాంక్యూ అధ్యక్షా.”
