J.SURENDER KUMAR,
ధర్మపురి మండలం మద్దునూరు శివారులో స్వయంభు వెలసిన శ్రీ గండి హనుమాన్ ఆలయం లో శ్రీరామ కళ్యాణం శుక్రవారం వైభవంగా జరిగింది.

అతి ప్రాచీన శ్రీ గండి హనుమాన్ ను సంతాన హనుమంతుడిగా భక్తులు పూజిస్తారు. కిమ్స్ సన్ సైన్ కార్పొరేట్ ఆసుపత్రి డైరెక్టర్, ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ శ్రీధర్ కస్తూరి స్వామివారిని దర్శించుకుని కళ్యాణంలో పాల్గొన్నారు..

వేలాది మంది భక్తజనంకు అన్నదానం నిర్వహణకు ప్రతి శ్రీరామనవమి రోజున డాక్టర్ శ్రీధర్ కస్తూరి వ్యక్తిగతంగా నిర్వాహకులకు ఆర్థిక సహాయం అందిస్తారు.

ఆలయ అభివృద్ధి, మండప నిర్మాణం, స్వాగత తోరణం లాంటి అభివృద్ధి పనులను డాక్టర్ శ్రీధర్ లక్షలాది రూపాయల తో చేయించారు. చిన్ననాటి మిత్రులతో డాక్టర్ శ్రీధర్ భోజన పూజాది కార్యక్రమంలో పాల్గొన్నారు.
