J.SURENDER KUMAR,
ధర్మపురి క్షేత్రంలో అంగరంగ వైభవంగా ఆదివారం సాయంత్రం జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు..
గత 13 రోజులుగా వైభవంగా జరిగిన స్వామి వారి జాతర ఉత్సవాలు రథోత్సవంతో ముగియనున్నాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వ్రతం తో పాటు శ్రీ వెంకటేశ్వర, శ్రీ రామలింగేశ్వర స్వామి, రథాలపై ఆసీనులైన ఆయా స్వాముల వారి ఉత్సాహ విగ్రహాలను దర్శించుకుని మంత్రి మోక్కులు తీర్చుకున్నారు. పట్టణ పురవీధుల గుండా కొనసాగిన రథోత్సవంలో మంత్రి ఆయన తనయుడు, హరీశ్వర్ పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..
శ్రీ లక్ష్మీనరసింహస్వామి కరుణాకటాక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై , ప్రత్యేకంగా రైతాంగం పై ఎల్లవేళలా ఉండాలని సకాలంలో వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని, కోరుకున్నట్టు మంత్రి తెలిపారు.

స్వామి వారి అనుగ్రహంతో రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాల నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్ కమిటీలు తనకు అవకాశం రావడం స్వామి వారి అనుగ్రహం తోనే అని మంత్రి అన్నారు.

మంత్రి వెంట స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి, ఆలయ కమిటీ చైర్మన్ జక్కు రవీందర్, కాంగ్రెస్ నాయకుడు సంఘనపట్ల దినేష్ తో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
