👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ స్పీకర్ గా సేవలందించిన స్వర్గీయ శ్రీపాదరావు పనితీరుతోనే స్పీకర్ పదవికి మరింత వన్నె వచ్చిందని, అజాతశత్రువుగా, శాసనసభలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతిపక్షాల గొంతుక వినిపించడానికి సముచిత సమయం కేటాయించి శాసనసభ చరిత్ర లో స్థానం సంపాదించుకున్న స్వర్గీయ శ్రీపాదరావు సేవలు చిరస్థాయిగా ఉంటాయని ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి పట్టణ నంది చౌరస్తా లో స్వర్గీయ శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలను ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి, కాంగ్రెస్ శ్రేణులు నివాళులు అర్పించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..…
ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అంచలంచలుగా ఎదిగి ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభకు శ్రీపాద రావు స్పీకర్ గా వ్యవహరించారని మంత్రి వివరించారు.
👉 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకు శ్రీపాదరావు అండగా నిలిచి వారి కష్టాల్లో భాగమయ్యారని మంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కి శ్రీపాద రావు చేసిన సేవలు మరువలేని అని మంత్రి పేర్కొన్నారు.
👉 తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు రాజకీయాల్లో రాణిస్తున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.
👉 తనలాంటి సామాన్య కార్యకర్తను రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా చేసిన ఘనత మంత్రి శ్రీధర్ బాబు కే దక్కుతుందని, ధర్మపురి తో నాడు శ్రీపాదరావు కు నేడు మంత్రి శ్రీధర్ బాబు కు విడదీయలేని బంధం సంబంధం ఉందని మంత్రి మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంఘనభట్ల దినేష్, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, వైస్ చైర్మన్ ఇందారపు రామయ్య తోపాటు పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
