శ్రీ సీతారామ కళ్యాణమే లోక కళ్యాణం మంత్రి లక్ష్మణ్ కుమార్!

👉 నియోజకవర్గంలోని గ్రామాలలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి అడ్లూరి !

J SURENDER KUMAR,

శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాల్లో పాల్గొని  సీతారామస్వామి కళ్యాణమే లోక కళ్యాణం మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 దొంతపూర్ లో…


ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహించిన కళ్యాణ వేడుకల్లో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం భక్తులతో కలిసి స్వామివారి కల్యాణాన్ని వీక్షించి ఆశీస్సులు పొందారు. గ్రామస్తులు, ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు మంత్రికి ఘనంగా స్వాగతించారు. శ్రీ సీతారామస్వామి కళ్యాణం తిలకించడానికి వేలాదిమంది భక్తజనం తరలివచ్చారు.


👉 తీగల ధర్మారం & ధర్మపురిలో..


  మండలంలోని తీగల ధర్మారం గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణం వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ధర్మపురి పట్టణంలోని శ్రీలక్ష్మీ నరసింహా కాలనీ నిర్వహించిన సీతారామ కళ్యాణంలో మంత్రి అడ్లూరి పాల్గొన్నారు.


👉 ధర్మారం మండల కేంద్రంలో..

ధర్మారం మండల కేంద్రంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మంత్రి కి ఘన స్వాగతం పలికారు.
ఆలయంలో ప్రత్యేక పూజల  అనంతరం సీతారామ కల్యాణంలో మంత్రి పాల్గొన్నారు.


👉 పెగడపల్లి మండలంలో..


పెగడపల్లి మండలంలోని ఐతుపల్లి,  ఎల్లాపూర్ గ్రామాల్లో నిర్వహించిన శ్రీసీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి రెండు గ్రామాల ఆలయాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు, ఆలయ కమిటీ సభ్యులు మంత్రి కి ఘన స్వాగతం పలికారు.


👉 శ్రీరాముడు సమాజానికి ఆదర్శం !


ఈ సందర్భంగా ఆయా శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ….
శ్రీ సీతారామచంద్ర మూర్తి, ధర్మ పాలనకు, తండ్రి ఆజ్ఞను ఆచరణలో చూపిన ఆదర్శమూర్తి అని  ప్రతి గ్రామాన అనాదిగా సీతారామ ఆలయాలు శ్రీ ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి అంటే.. శ్రీరాముడే అనాదిగా సమాజానికి ఆదర్శప్రాయుడనేది జగమెరిగిన సత్యం అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో ఆలయాలకు, అర్చకులకు,  వేద పండితులకు మంచి రోజులు వచ్చాయని మంత్రి అన్నారు.. భద్రాచలం సీతారామచంద్ర ఆలయ అభివృద్ధి కోసం మొదటి విడత దాదాపు ₹ 300 కోట్లు విడుదల చేసి శుక్రవారం భద్రాచలంలో అభివృద్ధి పనులకు పూజ చేశాడని  మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


👉 ధర్మపురి పట్టణంలో ర్యాలీ !


శ్రీరామనవమి పండుగ సందర్భంగా ధర్మపురి పట్టణ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రీ లక్ష్మణ్ కుమార్ ను కలిసి ప్రభుత్వ నామినేటెడ్ పదవులలో మున్నూరు కాపులకు అవకాశం కల్పించాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు.