తుంగతుర్తి ఎమ్మెల్యే హిందువులకు క్షమాపణలు చెప్పాలి!


👉 అఖిల బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల శాఖ !


J.SURENDER KUMAR,

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వేద ఆశీర్వచనం చేసిన బ్రాహ్మణులపై బూతు పదాలు వాడాడని హిందువులకు క్షమాపణలు చెప్పాలని అఖిల బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల శాఖ డిమాండ్ చేసింది.

శనివారం మధ్యాహ్నం తాసిల్ చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ చిత్రపటాన్ని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గాంధీభవన్ లో ఈనెల 12న మానకొండూరు ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణకు ఎస్సీ సెల్ చైర్మన్ గా పదవి ప్రమాణ స్వీకారం జరిగిన సభలో బ్రాహ్మణులు మానకొండూరు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం చేశారన్నారు.

ఈ సందర్భంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ బాపనోళ్ళు చదివిన మంత్రాల్లో లం.. కొడుకు లాంటి బూతు పదాలు పలికారని ఇది యావత్ హిందువులను అవమానించడమేనన్నారు. ఈ సభలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , పొన్నం ప్రభాకర్, తదితర మంత్రులు పలువురు దళిత ఎమ్మెల్యేలు పాల్గొన్నారని, పేర్కొన్నారు.

బహిరంగంగా వేదమంత్రాల అర్థం తెలుసుకోకుండా వేద ఆశీర్వచనం చేసిన బ్రాహ్మణులను పరుష పదజాలంతో ఆయన మాట్లాడడం సరి కాదని అన్నారు. సర్వేజనా సుఖినోభవంతు అంటూ వేద ఆశీర్వచనం చేసి శతమానం భవతి లాంటి వేదవాక్కులు పలికిన బ్రాహ్మణులను వేదాలను కించపరిచే విధంగా మాట్లాడాన్ని ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తుంగతుర్తి ఎమ్మెల్యే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సభలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వింటూ ఉండగా ఇలాంటి పరుష పదాలు వాడిన వ్యక్తిని ఎవరు కూడా అడ్డుకోలేకపోవడం ఇది హిందువుల  దౌర్భాగ్యం అని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి బ్రాహ్మణుడు లోకాసమస్తా సుఖినోభవంతు అందరూ బాగుండాలని ప్రతినిత్యం కోరుకుంటారని అలాంటి బ్రాహ్మణులను దుర్భాషలాడడం తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఆ పదవికి ఆయన అనర్హుడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా ఆది జాంబవ పరియోజన ప్రాంత  ప్రముఖ అలగుర్తి లక్ష్మీనారాయణ  బ్రాహ్మణ సంఘ నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ మాట్లాడుతూ బీసీ సీ గ్రూపుకు చెందిన వ్యక్తి తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ ఎస్సీ సర్టిఫికెట్ తో ఎమ్మెల్యేగా గెలుపొందారని మొట్టమొదట ఆయన రాజీనామా చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు

దీనివల్ల దళిత జాతికి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. వేదాల అర్థం తెలుసుకొని మాట్లాడాలని మందుల సామెల్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు మోతే ఉమాకాంత్ శర్మ, నాయకులు సిరిసిల్ల రాజేందర్ శర్మ, సురేష్ శర్మ, సంగనభట్ల గుండయ్య శర్మ,  మేడిపల్లి శ్రీనివాస్ శర్మ, నేరెళ్ల శ్రీనివాస్ చారి, మెట్ట కిరణ్ భాస్కర్ శర్మ, కొత్తపల్లి శ్రీనివాస్ శర్మ గుండి శ్రీనివాస్ శర్మ, కొత్తపెల్లి రాజశేఖర్ , రుద్రాంగి రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

👉 హిందూ సంప్రదాయాలను అవమానిస్తే
ఊరుకునే ప్రసక్తే లేదు !


హిందూ సంప్రదాయాలను అవమానిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగుల తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ను హెచ్చరించారు.

కాంగ్రెస్ ముఖ్యమంత్రి హిందూ దేవతలను అవహేళన చేస్తాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యేనేమో హిందూ సంప్రదాయాలను బూతులు తిడుతాడు.

కాంగ్రెస్ పొత్తు పార్టీ సనాతనధర్మాన్ని ఎయిడ్స్ తో  పోలుస్తుంది. అసలు కాంగ్రెస్ పార్టీ DNAలోనే హిందువ్యతిరేకత ఉన్నది. వాళ్ళ అసలు స్వరూపం సామ్యూలే మిగతాది నాటకమే  అని అమర్నాథ్ అన్నారు.