👉 ప్రభుత్వ పక్షాన డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం !
J.SURENDER KUMAR,
“ఉగాది” పర్వదినమును పురస్కరించుకొని గురువారం సాయంత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని శేషప్ప కళావేదికపై పంచాంగ శ్రవణము కార్యక్రమము జరిగింది.



ధర్మపురి క్షేత్రానికి చెందిన ప్రముఖ ప్రవచకులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన హైదరాబాదులో రవీంద్రభారతిలో పంచాంగ శ్రవణం చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితర శాసనసభ్యులు మంత్రులు హాజరై పంచాంగ శ్రవణం ఆలకించారు.
👉 ధర్మపురి ఆలయపక్షాన..






ఈ సందర్భములో వివిధ కళల యందు నిష్ణాతులైన ఇందారపు లక్ష్మీకాంతం (వేదం), గుంపుల ప్రభాకర్ (సాహిత్యం), బుగ్గారపు కిషోర్ (నాటక రంగం), శ్రీమతి బొజ్జ సావిత్రి (గాయిని), పాలెపు చంద్రశేఖర్ శర్మ (పురాణ ప్రవచకులు), గుండి మహాదేవ్ శర్మ (జ్యోతిష్య పండితులు) మరియు బుగ్గారపు రాజేంద్రప్రసాద్ శర్మ, పంచాంగకర్తలకు దేవస్థానము వారి తరుపున ఉగాది పురస్కారము అందజేసి సన్మానం జరిగింది.
👉 వేద పండితులు బొజ్జ రమేష్ కు సన్మానం !

ధర్మపురి ఆలయ వేదపండితుడు బొజ్జ రమేష్ శర్మ, ఉగాది పండుగ సందర్భంగా దేవాదాయ శాఖ పక్షాన హైదరాబాద్ లో ఉత్తమ వేద పండితుడి గా మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఘనంగా సన్మానించి మెమొంటో బహూకరించారు.
👉 గాయత్రి నిత్యాన్నదాన సత్రంలో..



ధర్మపురి క్షేత్రంలోని శ్రీ గాయత్రి నిత్యాన్న దాన సత్రం ఆధ్వర్యంలో ఆయా రంగాల్లో నిష్ఠులైన వారిని ఉగాది పర్వదినం సందర్భంగా ఘనంగా సన్మానించారు.
నాటక రంగం నుంచి సంఘనపట్ల ( మునిగాల)
కిషన్, వేద పారాయణం రంగం నుంచి పాలెపు చంద్రమౌళి, ప్రముఖ గాయకుడు గుండె జగదీశ్వర్ శర్మ సన్మానించారు.
