వృద్ధ తల్లిదండ్రుల సంక్షేమ బిల్లు దేశానికే ఆదర్శం!

👉 సీనియర్ సిటిజన్స్ సంఘాల ప్రశంసలు !

👉 సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అమోఘం అభినందనీయం !

👉  మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ కు అభినందనల జల్లులు !

J.SURENDER KUMAR,

వృద్ధ తల్లిదండ్రుల సంక్షేమాన్ని కాపాడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చట్టసభలలో ప్రవేశపెట్టిన బిల్లు దేశానికే ఆదర్శం అని  సీనియర్ సిటిజన్ సంఘాలు, సభ్యులు , ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.అసెంబ్లీలో సోమవారం ఈ బిల్లుకు చట్టబద్ధత లభించిన నేపథ్యంలో, వివిధ సీనియర్ సిటిజన్స్ సంఘాలు, సంఘాల ప్రతినిధులు మంత్రి లక్ష్మణ్ కుమార్ కలిసి ఘనంగా సత్కరించారు.

👉 వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణను చట్టబద్ధం చేస్తూ ఉద్యోగుల జీతాల నుంచే పోషణ ఖర్చు కట్ చేసే బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అమలు దిశగా తీసుకెళ్లడం విశేష స్పందన తెచ్చుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దూరదృష్టి నిర్ణయంపై సీనియర్ సిటిజన్స్ సంఘాలు ప్రశంసల వర్షం కురిపించాయి.

👉 ఉద్యోగస్తులు తమ తల్లిదండ్రుల బాధ్యతలను విస్మరిస్తే వారి జీతాలలో 15 శాతం వరకు కోత విధించే బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి, అనంతరం మండలిలోనూ ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనను  , అంకిత భావాన్ని గూర్చి సీనియర్ సిటిజన్ లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి వెల కట్టలేదని అభివర్ణించారు

👉 ఈ సందర్భంగా , వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  సీనియర్ సిటిజన్లను ఉద్దేశించి మాట్లాడుతూ...,

వృద్ధుల సంక్షేమానికి ఇంత గొప్ప చట్టాన్ని తీసుకురావడం పట్ల తాను సీనియర్ సిటిజన్స్ మంత్రిగా గర్విస్తున్నానని పేర్కొన్నారు.
కుటుంబ విలువలను కాపాడే దిశగా ఇది ఒక సంచలనాత్మక అడుగని మంత్రి తెలిపారు.


దేశ చరిత్రలోనే అరుదైన ఆలోచనగా ఈ నిర్ణయాన్ని కొనియాడారు. వృద్ధ తల్లిదండ్రుల సమస్యలను లోతుగా అర్థం చేసుకుని, వాటికి శాశ్వత పరిష్కారం చూపేలా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.


👉 వృద్ధులు ఎదుర్కొంటున్న నిర్లక్ష్యం, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం వంటి ప్రధాన సమస్యలకు ఈ చట్టం సమగ్ర పరిష్కారంగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు.

👉 పిల్లలపై నైతిక బాధ్యతతో పాటు చట్టబద్ధ బాధ్యతను కూడా నిర్దేశించడం ద్వారా కుటుంబ వ్యవస్థ మరింత బలపడుతుందని అన్నారు.

👉 ఈ బిల్లును సమర్థంగా ముందుకు తీసుకెళ్లడంలో అధికారులు  కీలక పాత్ర పోషించారని , అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా ఈ బిల్లు అమలు విషయంలో  పూర్తి సహకారం అందించాలని కోరారు.

👉 వృద్ధుల సంక్షేమంపై సీఎం రేవంత్ రెడ్డి   చూపుతున్న చిత్తశుద్ధి అభినందనీయమని మంత్రి  కొనియాడారు.ఈ బిల్లుకు  గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత చట్టరూపం దాల్చనుందని మంత్రి తెలిపారు. మహిళా, శిశు సంక్షేమం మరియు సీనియర్ సిటిజన్స్ విభాగాల కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శైలజల సేవలను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

👉 ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుంది !

వృద్ధుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం సాధించడంలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. ఈ చట్టం అమలులోకి వస్తే వృద్ధ తల్లిదండ్రులు గౌరవంతో, భద్రతతో జీవించే అవకాశం కలుగుతుందని, కుటుంబ బంధాలు మరింత బలపడతాయని సీనియర్ సిటిజన్స్ సంఘాలు విశ్వాసం వ్యక్తం చేశాయి. ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వారు స్పష్టం చేశారు.

👉 సీఎం రేవంత్ రెడ్డిని సన్మానిస్తాం !

వయోవృద్ధుల ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ముఖ్యమంత్రికి ఘన సన్మానం నిర్వహించాలని సీనియర్ సిటిజన్స్ ప్రతినిధులు ప్రతిపాదించగా, మంత్రి స్వాగతించారు.

ఈ సందర్భంగా ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ కాన్‌ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి. రామచంద్రయ్య, ఆర్గనైజేషన్ సెక్రటరీ, ఐఆర్ఎస్ రిటైర్డ్ అధికారి డి. పార్థసారథి, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు మంత్రిని శాలువాలతో సత్కరించారు.