వైద్యం సామాన్యుడికి అందుబాటులో ఉండాలి!

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

ప్రతి సామాన్యుడికి వైద్య సేవలు అందుబాటులో ఉంచి కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులపై  వినిపిస్తుంది ఆరోపణలు ఆవాస్తవం అనేలా సామాన్యులకు వైద్యం అందించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండటం చాలా అవసరమని అన్నారు. తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి నిర్వాహకులు కృషి చేయాలని సూచించారు.

వెల్గటూర్ మండల కేంద్రంలో శనివారం ప్రైవేటు ఆసుపత్రిని మంత్రి లక్ష్మణ్ కుమార్  సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా దీక్షిత్ హాస్పిటల్ నిర్వాహకుడు డాక్టర్ శివాజీ ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.