వేములవాడ లో మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు !

J SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన  వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు..

ఈసందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్  శ్రీ రాజరాజేశ్వర స్వామి కి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి వేములవాడ కు వచ్చిన సందర్భంగా ఆలయ పూజారులు మంత్రి కి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

మంత్రికి గౌరవ సూచకంగా పోలీస్ యంత్రాంగం గార్డ్ ఆఫ్ ఆనర్  ఇచ్చారు. ఆలయ అధికారులు మంత్రి లక్ష్మణ్ కుమార్ కు స్వామి వారి తీర్ధప్రసాదాలు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం బద్ది పోచమ్మ ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.