👉 రైతులను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,
J.SURENDER KUMAR,
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ప్రకటించడం తప్ప కొనుగోలు విషయంలో రాష్ట్రానికి ఎలాంటి సహకారం అందించడం లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ లలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ……
రైతులు పంట మార్పిడిలో భాగంగా జగిత్యాల జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగు చేశారని మంత్రి తెలిపారు. రైతులు పండించిన మొక్కజొన్న పంటలు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని మంత్రి వివరించారు.
👉 రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ₹ 2400 క్వింటాల్ మక్కలు కొనుగోలు చేస్తున్నామని మంత్రి వివరించారు.

👉 ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజోన్న కొనుగోలు కేంద్రాలతో రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు ₹ 500 కోట్ల భారం పడుతుందని మంత్రి తెలిపారు. ప్రజల కోసం బాధ్యతగా పనిచేస్తున్న ప్రభుత్వం కనుక రైతుల కోరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.
👉 రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కోరుట్ల నియోజకవర్గంలోని నాలుగు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. రైతులు ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా మొక్కజొన్నలు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని మంత్రి సూచించారు.
👉 రాష్ట్రంలో ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రాష్ట్రంలో గోదాముల్లో నిల్వ ఉన్న బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వంతో చేయించాల్సిన పనులను పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

👉 వందేళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలోనే శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీ రామ్ సాగర్ వంటి అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించమని మంత్రి గుర్తు చేశారు
👉 కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి..
రబీ సీజన్ లో రైతులు పండించిన మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వం డీసీ ఎంఎస్ ల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం ధర్మపురి వ్యవసాయ మార్కెట్ లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రైతులు ధర్మపురి నియోజకవర్గంలో 25% అధికంగా మొక్కజొన్న సాగు చేశారని అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి, వెల్గటూర్, బుగ్గారం, గొల్లపల్లి, పెగడపల్లి మరియు ఎండపల్లి మండలాల్లో సీజన్ లో 4898 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారని మంత్రి తెలిపారు.

ఆరు మండలాల్లో సుమారుగా 1.46 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారని మంత్రి తెలిపారు.
రైతులు పెద్ద ఎత్తున పంట సాగు చేసిన నేపథ్యంలో రైతులకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వం మెక్కజోన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.
రైతులు పండించిన పంటను దళారులు క్వింటాలుకు ₹1600 మాత్రమే చెల్లించి కొనుగోలు చేస్తున్నారని మంత్రి వివరించారు. రైతులకు మద్దతు ధర అందించాలని ప్రజా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందని మంత్రి తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నలు విక్రయించి క్వింటాలుకు ₹ 2400 మద్దతు ధర పొందాలని మంత్రి కోరారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు రైతుల సమస్యలు పట్టించుకోలేదని మంత్రి అన్నారు. ధాన్యం కొనుగోలు లో క్వింటాల్ కు నాలుగు కిలోల కోత విధించారని మంత్రి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాలుగా ఎలాంటి కోత లేకుండా రైతులు పండించిన పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ ధర్మపురి మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుముల లావణ్య లక్ష్మణ్, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, తదితరులు పాల్గొన్నారు.
