బాబు జగ్జీవన్ రామ్ జయంతిని విజయవంతం చేయండి !

👉 జయంతి వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

బాబు జగ్జీవన్ రామ్ జయంతిని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 5వ తేదీన నిర్వహించే బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లను శుక్రవారం హైదరాబాద్ లో మంత్రి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు.

👉 ఈ  సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

స్వాతంత్ర సమరయోధుడు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ప్రతి ఏటా ఏప్రిల్ 5వ తేదీన నిర్వహిస్తున్నామని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన బాబు జగ్జీవన్ రామ్ 30 ఏళ్లకు పైగా కేంద్ర మంత్రి వర్గంలో పనిచేశారని మంత్రి గుర్తు చేశారు.

అతి చిన్న వయసులోనూ బాబు జగ్జీవన్ రామ్  కార్మిక శాఖ మంత్రి గా పనిచేశారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రక్షణ, వ్యవసాయశాఖ మంత్రితో పాటు దేశ ఉప ప్రధానిగా పని చేసి దళితుల అభ్యున్నతికి కృషి చేశారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ఏప్రిల్ 5వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించే బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి అడ్లూరి పిలుపునిచ్చారు.