J SURENDER KUMAR,
ఈ నెల 20 న జగిత్యాల జరగనున్న బీఆర్ఎస్
భారీ బహిరంగ సభకు ఇంద్రవెల్లి సంఘటన,
జగిత్యాల జైత్రయాత్ర, సెంటిమెంట్ గా మారింది
మాజీ మంత్రి జీవన్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరిక,
సభకు కెసిఆర్ రానున్న నేపథ్యంలో
బిఆర్ఎస్ నాయకత్వం, సభ,
తేదీని ప్రాంతాన్ని సెంటిమెంట్ గా
ఎంచుకున్నట్టు సమాచారం..
మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, మాజీ పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్, తదితర బిఆర్ఎస్ అగ్రనాయకత్వం జీవన్ రెడ్డి ఇంటికి వచ్చి పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. మరుసటి రోజు జీవన్ రెడ్డి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్లి కెసిఆర్ ను కలవడం వారి లంచ్ మీటింగ్ లో జగిత్యాలలో బి ఆర్ఎస్ భారీ బహిరంగ సభ, పార్టీ అధినేత మాజీ సీఎం కెసిఆర్ రాక, ఆ సభలోనే జీవన్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరిక తదితర అంశాలు నిర్ధారించుకున్నట్టు సమాచారం.
👉 ఏప్రిల్ 20 ఇంద్రవెల్లి లో ఆదివాసీల తిరుగుబాటు, రేవంత్ రెడ్డి మొదటి మార్పు మీటింగ్ !
పిసిసి అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మొదటి కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ ను 2021 ఆగస్టులో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి లో దాదాపు లక్ష మందితో దళిత గిరిజన దండోరా సభగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి ఊపు తేవడంతో పాటు రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం మారాలి అనే నినాదం కు శంఖారావం పూరించారు.
👉1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి కాల్పుల ఘటన !

ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి లో 1981 ఏప్రిల్ 20న గిరిజన రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీలు తమ భూ హక్కుల కోసం, అన్యాక్రాంతమైన భూములను తిరిగి పొందడం కోసం నిర్వహించిన భారీ బహిరంగ జరిగింది. నక్సలైట్ల ప్రమేయం ఉందనే నెపంతో ప్రభుత్వం సభకు అనుమతి నిరాకరించి, విచక్షణారహితంగా కాల్పులు జరిపించింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ఆదివాసీలు అక్కడికక్కడే, మరికొందరు ఆసుపత్రిలో మరణించారు దక్షిణ భారతదేశ జలియన్వాలాబాగ్ గా ఏప్రిల్ 20 గా పిలుస్తారు. సంఘటన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం గిరిజనుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి అనేక పథకాలకు స్వీకారం చుట్టింది
👉 జగిత్యాల ప్రాంత ఎంపికలో ?

పోరాటాల పురిటి గడ్డ జగిత్యాలకు పోరాటాల ఉద్యమ చరిత్ర లో ప్రత్యేక స్థానం ఉంది.. 1978 సెప్టెంబర్ 9 భూమికోసం, భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం లక్షలాది మంది రైతు కూలీల ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో జరిగిన భారీ బహిరంగ సభకు జగిత్యాల్ జైత్రయాత్రగా పేరు. ఈ సభకు ముక్కు సుబ్బారెడ్డి అధ్యక్షత వహించగా, ఈ సభలో ప్రజా యుద్ధ నౌక, స్వర్గీయ గద్దర్ గజ్జ కట్టి ఆడారు పాడారు. నక్సలైట్ ఉద్యమానికి, ఉద్యమ నాయకత్వానికి జగిత్యాల జైత్రయాత్ర ఉగ్గుపాలతో ఊపిరి పోసిందని, నక్సల్స్, మావోయిస్టు ఉద్యమానికి జగిత్యాల జైత్రయాత్ర ఓ ప్రయోగశాలగా చర్చ. రైతు కూలీల భారీ బహిరంగ సభ అనంతరం నాటి ప్రభుత్వం జగిత్యాలను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది.
👉 అదే మైదానంలో బి ఆర్ఎస్ సభ ?

ప్రస్తుతం జగిత్యాల పరిసరాలలో స్థలాలు చదును చేయడం, తదితర ఏర్పాట్లు చేపట్టడానికి తగిన సమయం లేకపోవడంతో.. జైత్రయాత్ర నిర్వహించిన జగిత్యాల పట్టణ పాత బస్టాండ్ కళాశాల మైదానంలో ని దాదాపు లక్ష మందితో సభ నిర్వహణకు టిఆర్ఎస్ శ్రేణులు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
👉 20న జరిగే బి ఆర్ఎస్ సభలో..?
ఆదిలాబాద్ జిల్లాలో రగులుతున్న ఆదివాసి, లంబాడి సమస్య, కుల ధ్రువీకరణ పత్రం జారీ, సీఎం హోదాలో గత సంవత్సరం కాలం క్రితం రేవంత్ రెడ్డి అమరులైన గిరిజనుల జ్ఞాపకార్థం ఇంద్రవెల్లిలో ఎకరం స్థలంలో నిర్మించతలపెట్టిన ‘స్మృతివనం’ నిర్మాణానికి భూమి పూజ పనుల ప్రగతి తదితరంశాలపై వక్తల ప్రసంగంలో ఆరోపణలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మారాలి, మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలి అంటూ నినాదాలు చేయనున్నట్టు సమాచారం. సభా వేదికపై తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. బిఆర్ఎస్ మళ్లీ, టిఆర్ఎస్ గా ( భారత రాష్ట్ర సమితి నీ తెలంగాణ రాష్ట్ర సమితిగా పార్టీ మార్పు చేపట్టాలని ) సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేయించనున్నట్టు సమాచారం.

ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల నుండి జన సమీకరణ తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నుండి దాదాపు రెండు లక్షల జన సమీకరణకు లెక్కలు వేస్తున్న వేసవి నేపథ్యంలో లక్ష వరకు రావచ్చు టిఆర్ఎస్ శ్రేణుల అంచనా.
👉 ప్లీనరీ రంగారెడ్డి జిల్లాలో..?
బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం ఈనెల 27న రంగారెడ్డి జిల్లాలో రిసార్ట్ లో కొద్దిమంది కీలక నాయకులతో నిర్వహించడానికి ఆ పార్టీ అగ్రనాయకత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
జగిత్యాలలో ఈనెల 20న జరగనున్న బిఆర్ఎస్ భారీ బహిరంగ సభ కు ఇంద్రవెల్లి, జగిత్యాల, ఏప్రిల్ 20 తేదీల సెంటిమెంట్ ఆ పార్టీకి కలిసి వస్తుందో లేదో వేచి చూడాల్సిందే.
