J SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఎయిరోస్ట్రక్చర్స్ సంస్థ సీఓఓ, మేనేజింగ్ డైరెక్టర్ టిమ్ రైఫిల్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ భారతదేశంలో C-130J సూపర్ హెర్క్యులిస్ ఫైనల్ అసెంబ్లీ లైన్‌ను ఏర్పాటు చేయనుంది. అంతర్జాతీయ అవసరాల కోసం భారతదేశంలో లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ తో కలిసి సంయుక్తంగా F-16 వింగ్స్ ఉత్పత్తి చేసేందుకు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది.
రక్షణ రంగంలో ఎయిర్‌క్రాఫ్ట్ ఎంఆర్ఓ (MRO) ఫెసిలిటీతో పాటు ఇతర డిఫెన్స్ హబ్‌గా విస్తరిస్తున్న నేపథ్యంలో, తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి ఉన్నట్లు ఈ సందర్భంగా టిమ్ రైఫిల్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
👉 సి ఎం ను కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘనా హైకమిషనర్ !
భారత్‌లో రిపబ్లిక్ ఆఫ్ ఘనా హైకమిషనర్ ప్రొఫెసర్ క్వాసి ఒబిరి-డాన్సో ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్‌లో నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. హైకమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చారు.
ఈ భేటీలో పరస్పర సహకారం, సుహృద్భావ సంబంధాలపై చర్చించారు. ఘనా, తెలంగాణ మధ్య సంబంధాలు కొనసాగాలని హైకమిషనర్ గారు అభిలషించారు. ప్రధానంగా విద్య, శాస్త్ర సాంకేతిక, ఆరోగ్య, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారం ఉండాలని కోరగా, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.
