J SURENDER KUMAR,
ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి గారిని జూబ్లీ హిల్స్ నివాసంలో జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు చైర్మన్ డాక్టర్ మీనేష్ షా, మదర్ డైరీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జయతీర్థ చారి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవలసిన అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు.
ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి , ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి , మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి , ఇతర అధికారులు పాల్గొన్నారు.
