దళిత సాధికారతకు సిడిఎస్ కీలక వేదిక మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

దళిత సాధికారతకు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ (CDS) ఇది ఒక సమగ్ర వేదిక. ఇక్కడి మౌలిక వసతులు, పరిశోధనా సామర్థ్యం ప్రభుత్వానికి కూడా ఉపయోగపడగలవు అని ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 దళిత సాధికారతకు CDS కీలక వేదిక
₹15 కోట్ల ఎండోమెంట్‌కు ప్రతిపాదనలు – సానుకూలంగా సమర్పించిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి, వ్యక్తిగతంగా చొరవ తీసుకుని ముందుకు తీసుకెళ్తానని హామీ మంత్రి హామీ ఇచ్చారు.


👉 బొరబండలోని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ (CDS) దళితుల సమగ్ర అభివృద్ధికి ముఖ్య వేదికగా నిలుస్తోందని  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం మంత్రి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో కలిసి CDSను సందర్శించి, కేంద్రంలోని సదుపాయాలు, కార్యకలాపాలను సమగ్రంగా పరిశీలించారు.


👉 ఈ సందర్భంగా CDS చైర్‌పర్సన్ మల్లెపల్లి లక్ష్మయ్య,  కేంద్ర భవన నిర్మాణం, అందుబాటులో ఉన్న సదుపాయాలు, నిర్వహిస్తున్న కార్యక్రమాలపై వివరించారు. పార్కింగ్ సౌకర్యాలు, కామన్ హాల్, డైనింగ్ హాల్, పరిపాలన కార్యాలయాలు, ఆధునిక డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, డిజిటల్ మరియు ఫిజికల్ లైబ్రరీలు, మీడియా రూములు, శిక్షణార్థుల వసతి గదులు, అత్యాధునిక ఆడిటోరియం, దళిత్ మ్యూజియం వంటి విభాగాలను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు.


👉 గత 26 సంవత్సరాలుగా దళితులు, వెనుకబడిన వర్గాల సాధికారత కోసం CDS చేపట్టిన పరిశోధనలు, శిక్షణా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు, విధాన సూచనలపై లక్ష్మయ్య వివరించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, ప్రొఫెసర్ లింబాద్రి, సీనియర్ జర్నలిస్టు రామచంద్ర మూర్తి, తిప్పర్తి యాదయ్య తదితరులు కూడా కేంద్ర కార్యకలాపాలపై తమ అభిప్రాయాలను తెలిపారు.


👉 ప్రభుత్వ సహకారంతో చేపట్టాల్సిన పలు కీలక కార్యక్రమాలపై ప్రతిపాదనలు మంత్రికి సమర్పించారు.
ముఖ్యంగా దళిత యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన, UPSC, TGPSC వంటి పోటీ పరీక్షలకు కోచింగ్, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, ఎస్సీ/ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల పర్యవేక్షణ, భూహక్కుల పరిరక్షణ, సామాజిక-ఆర్థిక పరిశోధనలు, మహిళలు, యువతకు నాయకత్వాభివృద్ధి కార్యక్రమాలు, దళిత్ మ్యూజియం అభివృద్ధి, దళిత సాహిత్య డిజిటలైజేషన్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడ్వాన్స్‌డ్ ఆర్కైవ్స్ స్థాపన వంటి అంశాలను ప్రతిపాదించారు.


👉 ఈ కార్యక్రమాల అమలుకు ₹15 కోట్ల ఎండోమెంట్ ఫండ్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.


👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ CDS పనితీరును అభినందించి మాట్లాడుతూ….

ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ మరియు సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, కేంద్రానికి అవసరమైన మద్దతు అందించే చర్యలు తీసుకుంటామని తెలిపారు.


👉 అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి‌ను కలిసి కేంద్ర అభివృద్ధి అంశాలను వివరించి తగిన నిర్ణయాలు తీసుకునేలా కృషి చేస్తానన్నారు. CDSను శిక్షణా, పరిశోధనా కార్యక్రమాలకు నోడల్ సంస్థగా అభివృద్ధి చేసేందుకు పూర్తి సహకారం అందిస్తానని స్పష్టం చేశారు.


👉 దళిత వర్గాలకు విద్యే ప్రధాన బలం అని మంత్రి పేర్కొంటూ, నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి కల్పిస్తే యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించి విద్యాభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకోవడం, బడ్జెట్‌లో తగిన నిధుల కేటాయింపు ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.


👉 CDS వంటి సంస్థలు విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఈ కేంద్రానికి అవసరమైన ప్రభుత్వ మద్దతు అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి తెలిపారు.
ఈసందర్భంగా CDS భవనాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు ముఖ్యమంత్రిని ఆహ్వానించాలని చైర్‌పర్సన్ మల్లెపల్లి లక్ష్మయ్య కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు.