👉 గిరిజన విద్యార్థుల సమక్షంలో మంత్రి జన్మదిన వేడుకలు !
👉 పాఠశాలను పదవ తరగతి ఆఫ్ గ్రేడ్ చేస్తానని హామీ !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
రాజకీయంగా నాకు తొలిసారి అవకాశం కల్పించిన ధర్మారం మండలం పై తనకు ప్రత్యేక గౌరవం ఉంటుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గెలిచినా ఓడిన ధర్మారం మండల ప్రజలు తన వెన్నంటి ఉన్నారని మంత్రి అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, దివ్వాంగులు మరియు వయో వృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ తన జన్మదిన వేడుకలను బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మినీ గురుకుల గిరిజన పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో జరుపుకున్నారు.

ఈసందర్భంగా మినీ గురుకుల పాఠశాలలో అదనపు తరగతి గదులు నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు నూతన కిచెన్ షెడ్ ను ప్రారంభించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….
సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం విద్యకు ప్రధాన ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ధర్మపురికి ₹ 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు మంజూరి చేసిందని మంత్రి అడ్లూరి తెలిపారు.

ధర్మారం మండలంలోని గురుకుల పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుండి పదవ తరగతి వరకు తరగతులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ధర్మారం మండలానికి ఇప్పటికే ఐటిఐ కళాశాల మంజూరు చేశామని, రానున్న రోజుల్లో డిగ్రీ కళాశాల మంజూరుకి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా గురుకుల పాఠశాల విద్యార్థులకు సైకిళ్ళతో పాటు పరీక్షలకు హాజరై విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను మంత్రి అందజేశారు.
