ధాన్యం కొనుగోలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలి !

👉 యాసంగి (రబీ) 2025-26 ధాన్యం కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేయాలి !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

యాసంగి (రబీ)2025-26 సీజన్ నందు దాదాపు 483000 MTs ల వరిధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున అందు కొరకు ప్రణాళికలను సిద్దం చేయాలని ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దుల, వికలాంగుల మరియు ట్రాన్స్ జెండర్ సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


బుధవారం కలెక్టరేట్ లో  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మరియు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు.

యాసంగి (రబీ)2025-2026 యొక్క వరిధాన్యం కొనుగోలు విషయములో రా మరియు బాయిల్డ్ రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్స్ మరియు సంబంధిత శాఖ ల అధికారులతో సమీక్షా సమావేశము నిర్వహించారు.


👉 ఈ సందర్బంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

ఈ రబీ సీజన్ కు గాను IKP ఆధ్వర్యంలో – 119 దొడ్డురకం, 17 సన్నరకం మొత్తం 136 కొనుగోలు కేంద్రాలు, PACS- 287 MEPMA -1 మొత్తం – 435 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు. 

ప్రజా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు విజయవంతంగా పూర్తి చేశామని ఈ రబీ సీజన్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు రైస్ మిల్లర్ల ప్రతినిధులు మరియు ట్రాన్స్పోర్ట్ లు సమన్వయం చేసుకొని దాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

రైస్ మిల్లర్లు రబీ సీజన్ కు అనుగుణంగా దాన్యం నిలువల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని కోరారు. రైస్ మిల్లర్లలకు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల పక్షాన నిలబడి రైతులకు మరింత మేలు చేసే ఉద్దేశంతో రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు సహకరించాలని సూచించారు.

రైస్ మిల్లర్లు వివరించి అంశాలను తప్పనిసరిగా సంబంధిత శాఖ మంత్రి గారికి మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, అలాగే మన జిల్లాకు సంబంధించిన ఎలాంటి సమస్యలైనా పరిష్కరించడానికి అన్నివేలలా అందుబాటులో ఉంటానని తెలిపారు.

అలాగే రైస్ మిల్లర్ల సమస్యలను మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నివేదించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ఈసారి ధాన్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున లారీ యాజమాన్యాలు అందుకు అవసరమైన వాహనాలను సిద్ధంగా ఉంచాలని, అలాగే రైస్ మిల్లర్లు  ఎప్పటికప్పుడు మిల్లుకు వచ్చిన లారిని త్వరితగతిన దిగుమతి చేసుకోవాలన్నారు.

కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలతో లేకపోతే సంబంధిత పౌరసరఫరా క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారము ఇవ్వవలసినదిగా తెలిపారు.
ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
ఈ రబీ సీజన్ లో ధాన్యం కొనుగోలు సజావుగా జరిగే విధంగా రైస్ మిల్లర్లు మరియు ట్రాన్స్పోర్ట్ పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు.


👉 జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ….

గతంలో మన జిల్లాలో ధాన్యం కొనుగోలును  విజయవంతంగా పూర్తి చేశామని అదే విధంగా  ఈ సీజన్ కూడా  అధికారులందరు సమన్వయం చేసుకుంటూ వరి ధాన్యం కొనుగోళ్లను రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా విజయవంతంగా పూర్తిచేయాలని తెలిపారు.

రైతులు పండించిన ధాన్యం ధాన్యం కొనుగోలు కేంద్రానికి రాగానే నియమ నిబంధన ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని సెంటర్లలో ఏమన్నా ఇబ్బందులు తలెత్తితే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ప్రతి సెంటర్ వారిగా అధికారులందరూ ఎల్లవేళలా అందుబాటులో ఉండి దాన్యం కొనుగోలు సక్రమంగా జరిగే విధంగా చూడాలని కోరారు

👉 జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ

రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లాలో 435 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అందుకోసం సెంటర్ వారిగా ప్రత్యేక అధికారులను నియమించామని తెలిపారు.

కేటాయించిన అధికారులు, మండల స్థాయి అధికారులు పంచాయతీ సెక్రటరీలు మరియు జీపివోలు సంబంధిత కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ ప్రతి సెంటర్లో అన్ని ఏర్పాట్లు చేయాలని,  ధాన్యం కొనుగోలు సజావుగా జరిగే విధంగా చూడాలని మరియు రోజువారి నివేదికలు  ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి సమాచారం అందించాలని తెలిపారు.

ఏమైనా ఇబ్బందులు మరియు సమస్యలుంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేస్తూ రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అవంతరాలు లేకుండా అందరూ సమన్వయం చేసుకొని విజయవంతగా రబీ సీజన్ కొనుగోళ్లు పూర్తిచేయాలని తెలిపారు.

అంతకుముందు సంబంధిత జిల్లా శాఖ అధికారుల నుంచి ధాన్యం కొనుగోలు సంబంధించిన శాఖ వారి ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. అలాగే రైస్ మిల్లర్ల మరియు ట్రాన్స్పోర్టర్ల నుండి రబీ సీజన్ ఏర్పాట్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు

ఈ సమావేశములో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్. లత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దినేష్,  జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, జిల్లా స్థాయి సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులు, ట్రాన్స్పోర్టర్లు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.