ఫ్లాష్.. మహా విషాదంలో చేతివాటం !

👉 మానవత్వం మంట కలిసింది..

J.SURENDER KUMAR,

మాటలకు ఊహలకు అందని  మహా విషాద సంఘటన, కర్కశ హృదయాలు సైతం కన్నీరు కార్చిన హృదయ విదారక సంఘటన అది  ముక్కుపచ్చలారని ముగ్గురు టీనేజ్ స్నేహితులు ధర్మపురి పట్టణం శివారులో ఈ నెల ఒకటి అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత  పడగా, వారిలో ఒకరికి చెందిన లక్షలాది రూపాయల విలువైన ఐ ఫోన్  ఎవరో ప్రమాద స్థల నుంచి చేతివాటం ప్రదర్శించి ఎత్తుకెళ్లిన ఉదంతా ఆలస్యంగా తెలిసింది.

👉 రోడ్డు ప్రమాదం లో ముగ్గురు స్నేహితులు మృతి చెందిన వార్త దావనంలా వ్యాపించడంతో ధర్మపురి పట్టణం ఉలిక్కిపడింది. అర్ధరాత్రి ప్రమాదస్థలికి జనం జాతరలా తరలి మృతదేహాలను చూసి  కన్నీరు మున్నీరుగా విలపించారు. అల్లారుముద్దుగా, ఆరిపాదాలకు ముళ్ళు నాటకుండా,  పెంచుకుంటున్న ఆశల సౌదాలలో ఉన్న వారి  కన్న తల్లిదండ్రుల పాలిట  జీవితాంతం కన్నీటి రోదన, గర్భశోకం మిగిలిచిన సంఘటనలో ఎవరో చేతివాటం ప్రదర్శించారు.

👉 ముగ్గురు స్నేహితుల వద్ద ఉన్న మూడు సెల్ ఫోన్ లలో ప్రమాద స్థలంలో రెండు సెల్ ఫోన్ లు  పోలీసులు స్వాధీన పంచుకున్నట్లు సమాచారం. దాదాపు ₹ 1,75 లక్షల విలువ గల ఐఫోన్ ఎవరో మాయం చేసినట్టు తెలిసింది.

👉 రోడ్డు ప్రమాద విషాద సంఘటన నుంచి కుదుటప పడిన బాధిత కుటుంబం బంధువులలో ఒకరు  వారం రోజుల క్రితం మన వాడికి  ఐఫోన్ కొనిచ్చాం. అందులో ప్రమాదానికి ముందు స్నేహితులు ఏదైనా ఫోటోలు, వీడియోలు తీసారా ? అంటూ ఆరా తీయగా అప్పుడు లక్షలాది రూపాయలు విలువ గల ఐఫోన్ మాయమైనట్టు కుటుంబ సభ్యులకు మృతుడి స్నేహితులకు బంధువులకు తెలిసింది.

👉 ఆ ఫోన్ లో  తన మరో స్నేహితుడికి ఎమర్జెన్సీ నంబర్ ఫీడ్ చేసి ఉండగా. కొన్ని రోజుల క్రితం రాయపట్నం, మంచిర్యాల్  నుంచి స్నేహితుడి ఫోన్ కు  సిగ్నల్స్ వస్తున్నట్టు సమాచారం.

👉 పోలీస్ యంత్రాంగం విస్తృతంగా గాలిస్తూ, వివిధ కోణాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఐఫోన్ ఏ ప్రదేశంలో, ఏ సెల్ టవర్  నుంచి సిగ్నల్స్, రాడార్ ప్రాంతాన్ని కనుగొన్నట్టు సమాచారం. లక్షలాది రూపాయల విలువ గల ఫోన్ ఆచూకీ వెలికి తీసి బాధితుల కుటుంబ సభ్యులకు అప్పగించాలని పోలీస్ యంత్రాంగం కృషి చేస్తున్నట్టు సమాచారం.