గణపతిది విద్యావేత్తల కుటుంబం !

👉 ఆ కుటుంబం దళిత మహిళను కోడలుగా స్వాగతించింది !

👉 గణపతి లొంగుబాటు డెడ్ లైన్ ముగిసింది !

J SURENDER KUMAR,

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, అంతర్జాతీయ నిఘా సంస్థలకు మోస్ట్ వాంటెడ్ పర్సన్, మావోయిస్టు పార్టీ సుప్రీమ్ ముప్పాల లక్ష్మణరావు @ గణపతిది దొర కుటుంబం  ( వెలమ సామాజిక వర్గం) లో పుట్టిన వారి సోదరులందరూ విద్యావేత్తలు.

గణపతి కుటుంబం  గత కొన్ని దశాబ్దాల క్రితమే దళిత మహిళలను, తమ ఇంటి కోడలుగా ఆదరించి, స్వాగతించి కులరహిత చరిత్ర కు శ్రీకారం చుట్టిన ఘనత గణపతి కుటుంబానికే దక్కుతుంది.

నాడు గ్రామాలలో వందలాది ఎకరాలు భూములు వారికి ఉన్న ,లేకున్నా, ఆ సామాజిక వర్గ కుటుంబంకు చెందిన  కొందరు చోట, మోటో వ్యక్తులు గ్రామాలలో దొరలుగా, దర్జాగా దొరతనం చలాయించి, బాంచన్ దొర అనిపించుకునేవారు. నాటి కాలంలో ఈ అవకాశం గణపతి కుటుంబానికి  ఉన్న , ఆ కుటుంబంలో గణపతి తో పాటు మరో ఇద్దరు సోదరులు విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగులు, దాదాపు 60 సంవత్సరాల క్రితమే గణపతి సోదరులందరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ జీవనం కొనసాగించే వారు..

👉 కులాల పట్టింపులు లేని కుటుంబం !

గణపతి ( ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతుండగా)   పెద్ద సోదరుడు నరసింహారావు ( ప్రభుత్వ ఉద్యోగి) వీరు ఇద్దరు తమ సామాజిక వర్గం కు చెందిన వారిని వివాహం చేసుకున్నారు.. చిన్న సోదరుడు రామ్ చందర్రావు (ప్రభుత్వ ఉద్యోగి) కొన్ని దశాబ్దాల క్రితమే  దళిత మహిళలను ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లిని గణపతి కుటుంబం ఆదరించింది.  తమ సామాజిక వర్గం నుంచి అనేక విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్న గణపతి కుటుంబం మాత్రం మహిళను ఇంటి కోడలుగా స్వాగతించి  దశాబ్దాల క్రితమే కులరహిత చరిత్ర సృష్టించిన కుటుంబ గణపతిది.

గణపతి సోదరుడు నర్సింగా రావు, 
చేనేత జౌళి శాఖ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు. తమ్ముడు రాంచందర్ రావు  ప్రధానోపాధ్యాయుడు ఇటీవల మృతి చెందారు. గణపతి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ అజ్ఞాత బాట పట్టారు..

కేంద్ర ప్రభుత్వం విధించిన  లొంగుబాటు గడువు మార్చి 31 తో ముగియడంతో.. మావోయిస్టు మాస్టర్ మైండ్ గణపతితో పాటు మావోయిస్టులు కనబడితే కాల్చివేత  ఆదేశాలు జారీ చేయవచ్చు అనే చర్చ మొదలైంది.