J SURENDER KUMAR,
హనుమాన్ జయంతి సందర్భంగా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామంలోని గుండు హనుమాన్ దేవాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈసందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో ₹10 లక్షలతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రారంభించారు.
గొల్లపల్లి మండలం గంగాదేవి పల్లి గ్రామంలో ₹ 20 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనానికి మంత్రి గురువారం శంకుస్థాపన చేశారు.

ఈసందర్భంగా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని మహిళల కోరగా జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ తో మాట్లాడి వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని మంత్రి ఆదేశించారు.
