జగ్జీవన్ రామ్ జయంతి దళిత ఆత్మగౌరవ దినంగ మార్చాలి !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు కేవలం స్మరణకే పరిమితం కాకుండా, దళిత ఆత్మగౌరవ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే సంకల్పదినంగా మార్చాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.


👉 జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకల సందర్భంగా ఆదివారం హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

సమానత్వం, న్యాయం, స్వాభిమానం అనే మహనీయుడు చూపిన మార్గంలో తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని ఆయన స్పష్టం చేశారు. దళితులు, పేద, అణగారిన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ నిలుస్తోందని తెలిపారు.


👉 రాష్ట్ర ప్రభుత్వం జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడం దళితుల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమని అన్నారు.


👉 జగ్జీవన్ రామ్  దళితుల గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడని, కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని చెప్పారు.


👉 అధికారంలో ఉన్నప్పటికీ అణగారిన వర్గాల పక్షాన నిలబడిన అరుదైన నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అభివర్ణించారు.
“అవకాశం లభిస్తే దళితుడు కూడా ఉన్నత నాయకత్వం చేపడతాడు” అనే నమ్మకాన్ని ఆయన కార్యాచరణతో నిరూపించారని అన్నారు.


👉 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దేశానికి స్వాతంత్ర్యం మాత్రమే కాకుండా సామాజిక సమానత్వానికి పునాది వేసిందని మంత్రి తెలిపారు. రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కులు, రిజర్వేషన్లు కాంగ్రెస్ దృక్పథంతోనే సాధ్యమయ్యాయని చెప్పారు.


👉 భూమి సంస్కరణలు, విద్యా అవకాశాల ద్వారా పేదల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని వివరించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజాపాలన పారదర్శకంగా సాగుతోందని, “దళితుల అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యత” అనే సంకల్పంతో పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. సంక్షేమం మాత్రమే కాకుండా అధికారంలో భాగస్వామ్యం కల్పించడమే లక్ష్యమని మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.