జగిత్యాల పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు మళ్లింపు !

👉 వంతెన నిర్మాణం పనుల నేపథ్యంలో..!

👉 జగిత్యాల పోలీస్ !

J.SURENDER KUMAR,

నిజామాబాద్ హైవేలో హ్యాంగౌట్ హోటల్ సమీపంలోని మంచినీళ్ల బావి వద్ద వంతెన నిర్మాణ పనులు సోమవారం ( 06/04/2026 ) నుండి ప్రారంభం కానున్నందున, ట్రాఫిక్ సజావుగా కొనసాగేందుకు మరియు ప్రజల భద్రత దృష్ట్యా క్రింది మార్గాలలో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయబడుతున్నాయి  అని జగిత్యాల పట్టణ పోలీసులు ప్రకటనలో పేర్కొన్నారు.


👉 ప్రయాణికులు క్రింద పేర్కొన్న మార్గాలను తప్పనిసరిగా అనుసరించగలరు.


👉 1. RTC బస్సులు & భారీ వాహనాలు
(జగిత్యాల నుండి నిజామాబాద్):

జగిత్యాల → బీట్ బజార్ చౌరస్తా → ఎల్‌ఎల్ గార్డెన్ → లింగంపేట → అంతర్గాం గ్రామం → జగిత్యాల–నిజామాబాద్ బైపాస్ → జగిత్యాల–నిజామాబాద్ హైవే


👉 2. మూడు చక్రాల & నాలుగు చక్రాల వాహనాలు (జగిత్యాల నుండి నిజామాబాద్):


జగిత్యాల → బీట్ బజార్ చౌరస్తా → ఎల్‌ఎల్ గార్డెన్ → ఇస్లాంపురా రోడ్ → రాజేశుని గుట్ట రోడ్ → రాజేశుని గుట్ట ఖమాన్ → జగిత్యాల–నిజామాబాద్ హైవే


👉 3. కరీంనగర్ నుండి నిజామాబాద్ వెళ్లే వాహనాలు:

కరీంనగర్ హైవే → SRSP ధరోర్ కాలువ → జగిత్యాల–నిజామాబాద్ బైపాస్ రోడ్ (అంతర్గాం & చెల్గల్ గ్రామాల ద్వారా) → జగిత్యాల–నిజామాబాద్ హైవే


👉 4. మంచిర్యాల్, లక్షెట్టిపేట్ & ధర్మపురి నుండి నిజామాబాద్:

జగిత్యాల రాజీవ్ చౌరస్తా → జగిత్యాల బైపాస్ రోడ్ → చిన్న కాలువ చౌరస్తా → కరీంనగర్ రోడ్ → ధరోర్ SRSP కాలువ → జగిత్యాల–నిజామాబాద్ బైపాస్ రోడ్ (అంతర్గాం & చెల్గల్ గ్రామాల ద్వారా) → జగిత్యాల–నిజామాబాద్ హైవే


👉 5. పెద్దపల్లి, ధర్మారం & గొల్లపల్లి నుండి నిజామాబాద్:

జగిత్యాల బైపాస్ రోడ్ (సర్వాయి పాపన్న విగ్రహం) → చిన్న కాలువ చౌరస్తా → కరీంనగర్ రోడ్ → ధరోర్ SRSP కాలువ → జగిత్యాల–నిజామాబాద్ బైపాస్ రోడ్ (అంతర్గాం & చెల్గల్ గ్రామాల ద్వారా) → జగిత్యాల–నిజామాబాద్ హైవే


👉 6. నిజామాబాద్, ఆర్మూర్, మెట్‌పల్లి & కొరుట్ల నుండి వచ్చే భారీ వాహనాలు !

జగిత్యాల–నిజామాబాద్ బైపాస్ రోడ్ (చెల్గల్ & అంతర్గాం గ్రామాల ద్వారా) → SRSP ధరోర్ కాలువ → కరీంనగర్ హైవే & జగిత్యాల హైవే (టి-జంక్షన్)

కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ వెళ్లేవారు: కరీంనగర్ హైవే (NH 563) ఉపయోగించాలి
– జగిత్యాల, ధర్మపురి, లక్షెట్టిపేట్, మంచిర్యాల్, పెద్దపల్లి వెళ్లేవారు: జగిత్యాల హైవే (NH 563) ఉపయోగించాలి


👉 7. గమనిక (RTC బస్సులు మాత్రమే – నిజామాబాద్ నుండి జగిత్యాల ):

నిజామాబాద్, ఆర్మూర్, మెట్‌పల్లి, కొరుట్ల, రాయకల్ నుండి జగిత్యాల వచ్చే RTC బస్సులు ఈ మార్గాన్ని అనుసరించాలి:

జగిత్యాల–నిజామాబాద్ హైవే (NH 63) → స్వప్న ధాబా → జగిత్యాల–నిజామాబాద్ బైపాస్ రోడ్ → అంతర్గాం గ్రామం → లింగంపేట → ఎల్‌ఎల్ గార్డెన్ → బీట్ బజార్ చౌరస్తా → జగిత్యాల


👉 8. మూడు చక్రాల & నాలుగు చక్రాల వాహనాలు (నిజామాబాద్ నుండి జగిత్యాల):

Close up of road closed and diversion signs.

నిజామాబాద్, ఆర్మూర్, మెట్‌పల్లి, కొరుట్ల, రాయకల్ నుండి వచ్చే 3 & 4 వీలర్ వాహనాలు ఈ మార్గాన్ని అనుసరించాలి:

జగిత్యాల–నిజామాబాద్ హైవే (NH 63) → రాజేశుని గుట్ట ఖమాన్ → రాజేశుని గుట్ట రోడ్ → ఇస్లాంపురా రోడ్ → ఎల్‌ఎల్ గార్డెన్ → బీట్ బజార్ చౌరస్తా → జగిత్యాల


👉 గమనిక: జగిత్యాల పట్టణంలో పని ఉన్న 3 వీలర్  or  4 వీలర్ వాహనాలు మాత్రమే పై (Route No. 8) మార్గాన్ని ఉపయోగించాలి. పట్టణంలో పని లేని వాహనాలు జగిత్యాల–నిజామాబాద్ బైపాస్ రోడ్ ద్వారా ప్రయాణించాలి.


👉 ప్రజలకు సూచనలు:

వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించి సూచించిన మార్గాలను తప్పనిసరిగా అనుసరించాలి.
– జాగ్రత్తగా వాహనం నడపండి మరియు ట్రాఫిక్ నియమాలు పాటించండి.
– ఇబ్బందులు లేకుండా ముందుగానే ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోండి.