జీవన్ రెడ్డే మార్పు కోరుకుంటున్నారు-ప్రజలు కాదు!

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

జీవన్ రెడ్డి పార్టీ మారడానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదని, రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకోవడం లేదని, జీవన్ రెడ్డే మార్పు కోరుకుంటున్నారని, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ
శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలో గురువారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, డిసిసి అధ్యక్షులు నందయ్య,  కాంగ్రెస్ నాయకులతో కలిసి  మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా జీవన్ రెడ్డి పార్టీ మార్పు అంశంపై మంత్రి స్పందించారు.

👉 మీడియా సమావేశ ముఖ్యాంశాలు…

👉 పదేళ్ల పాటు కెసిఆర్ ను విమర్శించిన జీవన్ రెడ్డి, ఇప్పుడు అదే పార్టీలో చేరడం సరైంది కాదని విమర్శించారు. జీవన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రి పదవి ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు.

👉 ఓటమి అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి “అన్నా బాధపడకు” అంటూ భరోసా ఇచ్చినట్లు మంత్రి  తెలిపారు.

👉 వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ మారడం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని మంత్రి అన్నారు.

👉 జీవన్ రెడ్డి పార్టీ పై అసంతృప్తితో ఉన్నప్పుడు నేను, శ్రీధర్ బాబు , పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, మరియు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసి వేణుగోపాల్ ,AICC సెక్రటరీ వంశీ చందర్  వచ్చి జీవన్ రెడ్డి తో పార్టీని వీడద్దని, ఏమైనా ఉంటే కలిసి చర్చిద్దాం అని కోరడం జరిగిందన్నారు.

👉 కేంద్రంలో బీజేపీ ఉండాలి, రాష్ట్రంలో BRS ఉండాలి అని వారు మాట్లాడటం జరిగింది.. రాష్ట్ర ప్రజలు KCR నీ కోరుకుంటే మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో ఎందుకు ప్రజలు ఆ పార్టీనీ ఓడగొట్టారు అనే మంత్రి ప్రశ్నించారు.

👉 ఏదో విధంగా రాష్ట్ర నాయకత్వం పై దాడి చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని బలహీన పర్చాలని ఉద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేయడం జరుగుతుంది అన్నారు.

👉 గత ప్రభుత్వంలో ఎన్నడు లేని విధంగా పేద ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద విద్యార్థులకు కాస్మొటిక్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది, ₹200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణాన్ని చెయ్యడం జరుగుతుంది అన్నారు.

👉 కాళేశ్వరం లింక్ 2 పేరుతో మా గోదావరి నీళ్లు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కు తీసుకెళ్తుంటే అప్పుడు ఎందుకని మౌనంగా ఉన్నారని మంత్రి ప్రశ్నించారు.

👉 నాకు KCR, కొప్పుల ఈశ్వర్ ఆ పార్టీలో ఉన్న నాయకులు అందరూ అత్యంత ఆప్తులు అని చెప్పినప్పుడు మాకు బాధగా అనిపించింది అన్నారు.

👉 నేను, 2023 ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి కాంగ్రెస్ పార్టీ నాకు జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్, మరియు MLA టికెట్లు ఇచ్చి నన్ను గుర్తించింది, ఈ ఎన్నికల్లో నేను  మరొక్కసారి ఓడిపోతే నన్ను నమ్ముకున్న కార్యకర్తల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని రేవంత్ రెడ్డి తో చెప్పడం జరిగింది మంత్రి అన్నారు.

👉  రేవంత్ రెడ్డి  నా ఆస్తులు అమ్మి అయినా సరే KCR నీ ఒడగొట్టాలి మీరు ప్రజల్లో ఉండాలి అని మాకు భరోసా ఇవ్వడం జరిగింది.. అని మంత్రి అన్నారు.