👉 మరో మారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది !
👉 బీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగలేదు
అందుకే నేడు క్యాబినెట్ లో మంత్రిని అయ్యాను !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియామకమైన సంగనభట్ల దినేష్ పదవి ప్రమాణ స్వీకారం, అభినందన సభ జగిత్యాల జిల్లా కేంద్రంలో ని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…….

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ గెలిచిన, ఓడిన ప్రజల మధ్యనే ఉంటూ ముందుకు సాగానని అన్నారు. అనేక అవమానాలు ఎదుర్కొంటూ ఎన్నికల్లో ఓటమి చెందిన అధైర్య పడకుండా కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకొని ముందుకు సాగినట్లు మంత్రి తెలిపారు. పార్టీలో కమిట్మెంట్ గా పని చేశాను కనుక నేడు క్యాబినెట్ లో పని చేసే అవకాశం దక్కిందని మంత్రి అడ్లూరి అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తనకు అనేక ఆఫర్లు ఇచ్చిందని అయినప్పటికీ ఏలాంటి ఆఫర్లను లొంగకుండా కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని మంత్రి అడ్లూరి అన్నారు.

జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు సరైన సమయంలో గుర్తింపు లభిస్తుందని ఎవరు నిరాశ పడవద్దని మంత్రి అన్నారు.
👉 రేవంత్ రెడ్డి పాలన ఎందుకు పోవాలి ?
రాష్ట్రంలో రేవంత్ పాలన పోవాలి.. మార్పు రావాలి అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎత్తుకున్న నినాదం ఎందుకు ? ప్రశ్నించారు.
రాష్ట్రంలో సన్నబియ్యం పథకం అమలు చేస్తున్నందుకు మార్పు రావాలా.. ? అర్హులకు రేషన్ కార్డు లు అందించినందుకు మార్పు రావాలా..? నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినందుకు మార్పు రావాలా.. ? మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు మార్పు రావాలా ..? అని జీవన్ రెడ్డిని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని రానున్న రోజుల్లో నిత్యం ప్రజల మధ్య ఉంటూ రాష్ట్రంలో మరో మారు అధికారంలోకి వస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
2029 లో సైతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు.

నూతన గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా నియామకమైన సంగనభట్ల దినేష్ కు మంత్రి లక్ష్మణ్ కుమార్, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , జగిత్యాల శాసనసభ్యుల సంజయ్ కుమార్ , రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనివాస్, ( శీను బాబు) జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య , కోరుట్ల శాసనసభ ఇంచార్జ్ కాంగ్రెస్ జువ్వాడి నరసింహారావు , జగిత్యాల, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ లు సమిండ్ల వాణి వేముల నాగలక్ష్మి, ధర్మపురి మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుముల లావణ్య మరియు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ కు ఘన స్వాగతం !

అభినందన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి లక్ష్మణ్ కుమార్ కు ఫంక్షన్ హాల్ ముందు బాణసంచా కాల్చి ఘన స్వాగతం పలికారు.
గ్రంథాలయాలకు లక్ష పుస్తకాల బహుకరణకు అభినందన సభలో శ్రీకారం చుట్టారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు నిర్వాహకులు పండ్ల బుట్టలను బహుకరించారు.

ధర్మపురి ఆలయా అర్చకులు, వేద పండితులు, దినేష్ ను వేదికపై ఘనంగా సన్మానించారు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు, తరలివచ్చారు.
