👉 లోయర్ ట్యాంక్ బండ్ లో అంబేద్కర్ నాలెడ్జ్ పార్క్ నిర్మాణం !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
హైదరాబాద్ కాచిగూడ లోని నింబోలి అడ్డలో ₹ 30 కోట్లతో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ ను నిర్మిస్తున్నామని, లోయర్ ట్యాంక్ బండ్ లో పది అంతస్తులకు తగ్గకుండా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు అంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సబికుల హర్షద్వానాల మధ్య వెల్లడించారు.
👉 జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకల సందర్భంగా ఆదివారం హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రసంగిస్తూ,

👉 దళిత విద్యార్థులకు ఉన్నత విద్యలో బలమైన మద్దతు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్-1, 2, 3, 4 వంటి పోటీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలను త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.యువతకు ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.

👉 హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో ₹100 కోట్లతో 10 అంతస్తుల అంబేద్కర్ టవర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. అలాగే నిబ్మోలి గడ్డ హాస్టల్‌కు ఆధునిక సౌకర్యాలతో నూతన భవనం నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
👉 గ్రామ స్థాయిలో దళితుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తూ, మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి చెప్పారు.
👉 ప్రభుత్వం ప్రజల దగ్గరకు వెళ్లే విధానాన్ని అవలంబిస్తూ ప్రతి బలహీన వర్గానికి అండగా నిలుస్తోందన్నారు.
👉 “దళిత ఓటు కాదు దళిత గౌరవమే ముఖ్యమని కాంగ్రెస్ నమ్మకం. కాంగ్రెస్ పాలనలో భయం ఉండదు భరోసా ఉంటుంది” అని మంత్రి స్పష్టం చేశారు.

👉 సమాజంలో చివరి వ్యక్తి వరకు అభివృద్ధి చేరేలా కృషి చేస్తూ, వివక్షలేని తెలంగాణ నిర్మాణమే లక్ష్యమని అన్నారు. చివరిగా, “జగ్జీవన్ రామ్ ఆశయాలకు జై, దళిత ఐక్యతే మా బలం, సామాజిక న్యాయం కాంగ్రెస్ ధర్మం” అంటూ నినాదాలు చేశారు.
👉 ప్రతి దళిత కుటుంబానికి గౌరవం, ప్రతి యువకుడికి అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. “జగ్జీవన్ రామ్ కలల భారతాన్ని తెలంగాణలో సాకారం చేస్తాం” అని మంత్రి ముగించారు.
👉 ఈ కార్యక్రమంలో …….

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ, మాజీ గవర్నర్ దత్తాత్రేయ, మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహ, పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, మాజీ పార్లమెంట్ సభ్యులు వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ మరియు కౌన్సిల్ విప్ అద్దంకి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామెల్, నాగరాజు, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రొఫెసర్ కాసిం, ఎస్సై కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, జేబీ రాజు, మేడి పాపయ్య, ఉత్సవ కమిటీ నేతలు, పలువురు దళిత నాయకులు కార్యక్రమానికి హాజరై బాబు జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులర్పించారు. ప్రముఖ కళాకారుడు ఏపూరి సోమన్న ఆలపించిన గీతాలు ఆహుతులను ఉర్రూతలుగుంచాయి.
