👉 జగిత్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ అభినందన సభలో ….
J SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంగనభట్ల దినేష్ ప్రమాణస్వీకారం.అభినంద సభలో గ్రంధాలయాలకు లక్ష పుస్తకాల విరాళాల లక్ష్యానికి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్, సమక్షంలో అంకురార్పణ జరిగింది.
గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా ప్రభుత్వం నియమించిన దినేష్ అభినందన సమావేశం శనివారం జగిత్యాల పట్టణంలోని సుమంగళి గార్డెన్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అభిమానులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు శాలువలు, పూల దండలకు బదులు పుస్తకాలు ఇవ్వండి అనే పిలుపు మేరకు.. ధర్మపురి కి చెందిన కవి రచయిత పెద్ది భరత్ ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ మరియు ఇతర జిల్లాల రచయితల దాదాపు ₹10 వేల రూపాయలు విలువ గల వంద పుస్తకాలు సేకరించి మంత్రి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో డాక్టర్ గొల్లపల్లి గణేష్, పెద్ది భరత్, లు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, గ్రంధాలయ చైర్మన్ దినేష్ కు బహుకరించారు.
