మళ్లీ రేవంత్ రెడ్డి సీఎం  అవుతారు !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

రాష్ట్ర ప్రజల,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అండదండలతో  2029లో సైతం రేవంత్ రెడ్డి  రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జగిత్యాల జిల్లాలో  కోరుట్ల, మెట్టుపల్లి, గొల్లపల్లి, ధర్మపురి, ధర్మారం, మండల కేంద్రాలలో శుక్రవారం మంత్రి లక్ష్మణ్ కుమార్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు..

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ….

👉 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి మర్చిపోయారని మంత్రి అన్నారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఒక్క హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదని మంత్రి ఆరోపించారు.  దళితున్ని ముఖ్యమంత్రి చేస్తామన్నారని  కానీ ఏనాడు దళితులను కేసీఆర్ పట్టించుకోలేదని మంత్రి  ఆరోపించారు.

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేసి తీరుతామని  మంత్రి అన్నారు..  గత ప్రభుత్వం లో చేసిన   అప్పుల తో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని  మంత్రి అన్నారు.


👉 పార్టీ మారడం జీవన్ రెడ్డి వ్యక్తిగత నిర్ణయం.!

మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మారడం ఆయన వ్యక్తిగత విషయమని మంత్రి  లక్ష్మణ్ కుమార్ అన్నారు. అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం నేపథ్యంలో పార్టీ మారవద్దని రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు తో పాటు తో పాటు పలువురు ఎమ్మెల్యేలు స్వయంగా కలిసి పార్టీ మారవద్దని కోరినట్లు మంత్రి అడ్లూరి తెలిపారు.


👉 కార్యకర్తల గూర్చి కేటీఆర్ మాట్లాడడం విడ్డూరం..


పదేళ్లపాటు అధికారంలో ఉండి తెలంగాణ ఉద్యమకారులను కార్యకర్తలను పట్టించుకోని కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ తమ కార్యకర్తలను పట్టించుకోవడంలేదని లో మాట్లాడడం విడ్డూరంగా ఉందని  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


👉 తెలంగాణ  ఏర్పడిన తర్వాత కేవలం కుటుంబంలోని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. మిగిలిన ఉద్యమకారులను, కార్యకర్తలను నాటి గడీల పాలనలో పట్టించుకోలేదని మంత్రి అన్నారు.


👉 అధికారంలో ఉన్న సమయంలో కార్యకర్తలను పట్టించుకోని కేటీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని చేస్తున్న ఆరోపణలు విడ్డూరంగా ఉన్నాయని మంత్రి అన్నారు.


👉 తాను సామాన్య కార్యకర్తగా ఉంటూ నేడు క్యాబినెట్ మంత్రి వరకు వచ్చానని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి పక్కన ఒక కార్యకర్త కూర్చునే అవకాశం వచ్చిందని, నాడు మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ ను కేసీఆర్ ఏనాడు తన పక్కన కూర్చోబెట్టుకోలేదని మంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీ  తమ కార్యకర్తలను అధిష్టానం కంటికి రెప్పలా కాపాడుకుంటుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.