👉 నేడు మంత్రి పుట్టినరోజు !
J.SURENDER KUMAR,
రెండు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో అవమానాలు….. అణచివేతలు…
అరెస్టులు….. అక్రమ కేసులు….. హేళనలు…
కుల వివక్షత…. పలు ఓటములు… పడిలేసిన కెరటంలా… ఓటమి…. అవమానలు … హేళనలు.. దిగమింగుకొని . పట్టు వదలని విక్రమార్కుడిగా…. ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై ……. రాజిలేని పోరాటం చేసి….. 2023 ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అడ్లూరీ లక్ష్మణ్ కుమార్, బుధవారం నాటికి 59 వసంతంలోకి అడుగు పెడుతున్నారు నేడు ఆయన పుట్టినరోజు..

👉 ఏ నిమిషానికి ఏమి జరుగునో !
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరో.. అని ఏ కవి రాశాడో ఆ అక్షరాలు అక్షర సత్యంగా అగుపిస్తున్నాయి. 2014 నుంచి 2023 వరకు ఎ నాయకుడిని అయితే బలవంతంగా కొందరు పోలీసులు అనేక సందర్భాలలో అరెస్టులు చేశారో… అక్రమ కేసులు నమోదు చేశారో…. ఆ పోలీస్ లు… ఆఅధికారులు … నేడు ఆ నాయకుడు మంత్రి లక్ష్మణ్ కుమార్ కు….. సెల్యూట్ చేస్తూ, పూల బొకే అందిస్తూ…. శాలువాలు కప్పి సన్మానిస్తున్నారు.
👉 అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
మాజీ జెడ్పీ చైర్మన్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ ఎ.పి.ఎస్.ఎఫ్.సి. చైర్మన్ ,
👉 2009 లో …
నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం ధర్మపురి నియోజకవర్గం ( ఎస్సీ) పోటీ చేసి 1,365 ఓట్ల స్వల్ప తేడాతో ఎన్నికల్లో ఓటమి.
2018 లో ధర్మపురి నుంచి ఎమ్మెల్యే పోటీ చేసి 441 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు.
👉 తండ్రి పేరు నాగయ్య.
👉 పుట్టిన తేదీ 01-04-1968
👉 స్వగ్రామం ! పెద్దపల్లి..
👉 విద్యా ! ఇంటర్మీడియట్ ఐటిఐ పెద్దపల్లి.
👉 సామాజిక వర్గం ! ఎస్సీ (మాదిగ)
👉 1982-1985
లో NSUI విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా . గోదావరిఖని జూనియర్ కళాశాల గెలుపు.
👉 1986-1994
ఉమ్మడి కరీంనగర్ జిల్లా NSUI ప్రధాన కార్యదర్శిగా..
👉 1994-1996
జనరల్ సెక్రటరీ, జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ, కరీంనగర్.
👉 1996-2001
ఏ.పి. యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి!
👉 ధర్మారం జడ్పిటిసి సభ్యుడిగా గెలుపు !
2006 టీడీపీ ఎమ్మెల్యే & మాజీ మంత్రి మాతంగి నర్సయ్యపై జెడ్పీటీసీ ధర్మారం మండలం (ఎస్సీ రిజర్వ్డ్) పోటీ చేసి మూడువేల మెజార్టీ ఓట్లతో గెలుపొందారు.
👉 2010-2012
కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా పనిచేశారు
👉 2013-2014
చైర్మన్, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల ఫైనాన్స్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
👉 2013-2014
ప్రధాన కార్యదర్శి (పిసిసి) ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్
👉 2019
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీకి జిల్లా అధ్యక్షుడిగా..
👉 2023 లో ఎమ్మెల్యేగా విజయం !

ధర్మపురి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా 21692 ఓట్ల మెజార్టీతో సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి కొప్పుల ఈశ్వర్ పై విజయం సాధించారు
👉 2006 లో..
స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మారం జడ్పిటిసి సభ్యుడిగా మాజీ మంత్రి మాతంగి నరసయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా లక్ష్మణ్ కుమార్ పోటీపడ్డారు. ఎన్నికల్లో మాజీ మంత్రి మాతంగి నరసయ్య పై లక్ష్మణ్ కుమార్ ,మూడు వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
👉 2025 లో క్యాబినెట్ మంత్రిగా.

2025 జూన్ 8న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండో విడత విస్తరించిన మంత్రివర్గంలో కేవలం ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారు. అందులో అట్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి పదవి దక్కింది.
👉 ప్రలోభాలకు లొంగలేదు పార్టీ మారలేదు !
1982 లో విద్యార్థి దశ నుంచే అనుబంధ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం (NSUI ) కొనసాగుతున్న లక్ష్మణ్ కుమార్, ను అధికార టిఆర్ఎస్ పార్టీ , పదవులు పార్టీ టికెట్లు ఇస్తా అంటూ ప్రలోభాలకు గురి చేసిన కాంగ్రెస్ పార్టీ నీ లక్ష్మణ్ కుమార్ వీడలేదు..
👉 వన్ మ్యాన్ ఆర్మీ మంత్రి లక్ష్మణ్ కుమార్ !

ప్రజాక్షేత్రంలో 2009 నుంచి 2023 వరకు వరుస గా ఓటమి చెందిన తన క్యాడర్ లో ఉత్సాహం నింపుతూ గెలుపు ఓటములు ప్రజాస్వామ్యంలో సహజం అంటూ క్యాడర్ చేజారకుండా కాపాడుకున్న లీడర్ లక్ష్మణ్ కుమార్..
👉 తన క్యాడర్ ను మరువని లీడర్ !
కష్ట కాలంలో తన వెంట ఉన్న క్యాడర్ లక్ష్మణ్ కుమార్ విస్మరించలేదు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నియోజకవర్గంలోని దాదాపు 5 మార్కెట్ కమిటీల కమిటీల నియామకం లో వారికి ప్రాధాన్యమిచ్చారు..
ధర్మపురి మున్సిపల్ గత టిఆర్ఎస్ ప్రభుత్వ ఎన్నికల్లో 15 కౌన్సిలర్ స్థానాలలో 7 ఏడు స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు.. 2026 ఎన్నికల్లో 15 స్థానాలకు 15 క్వీన్ స్వీప్ చేసి రాష్ట్ర స్థాయిలో ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే.. గతంలో హామీ ఇచ్చిన మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ గా జనరల్ స్థానంలో బీసీ మహిళ వేముల నాగలక్ష్మి కి పట్టం కట్టారు..
విద్యా, వ్యాపారం వదులుకొని ప్రతి ఎన్నికల్లో అన్ని తన వెన్నంటి ఉండి కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సంగనభట్ల దినేష్ కు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని కట్టపెట్టారు.
2023 ఎన్నికల్లో ప్ర గెలుపుకు కృషి చేసిన జక్కు రవీందర్ కు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలకవర్గ చైర్మన్ పదవిని, గతంలో జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో నియోజకవర్గంలో దాదాపు 75 శాతం గెలిపించుకున్నారు.
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రజలు తనను కలసి సమస్యలు చెప్పుకునే పరిస్థితిని కల్పించారు అని చెప్పుకోవచ్చు..
