👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక గ్రామసభలో !
J.SURENDER KUMAR,
24 నెలల క్రితం ఏర్పాడిన మా ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించే విధంగా ముందుకు సాగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన గ్రామ సభలో మంత్రి పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..
రాష్ట్రంలో ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పాడిన నాటి నుండి నేరెళ్ల గ్రామానికి వివిధ సంక్షేమ పథకాల ద్వారా ₹134.90 కోట్ల ప్రభుత్వం అందించిందని మంత్రి తెలిపారు. రైతు బీమా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి, గ్యాస్ సబ్సిడీ చేయూత పెన్షన్, కళ్యాణ లక్ష్మి, ఇందిరా మహిళా శక్తి, వడ్డీ లేని రుణాలు కొత్త రేషన్ కార్డు వంటి పథకాలను ప్రభుత్వం అందజేస్తుందని మంత్రి వివరించారు.
👉 వీటితోపాటు కొత్తగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉదయం టిఫిన్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు.

👉 ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామని, కుటుంబ పెద్ద ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల పాలు కాకుండా ఇందిరమ్మ జీవిత ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు మంత్రి వివరించారు.
👉 ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా నేరెళ్ల గ్రామంలో ₹200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేస్తున్నామని మంత్రి తెలిపారు.
👉 పేద ప్రజలు తమ పిల్లలకు ప్రైవేటు విద్యను అందించలేని స్థితిలో ఉన్నారని పేద ప్రజలకు నాణ్యమైన ప్రభుత్వ విద్యను అందించాలనేది ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం అని మంత్రి అడ్లూరి తెలిపారు.
👉 రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం అనేక నిధులు కేటాయిస్తుంద ని గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించి నాణ్యమైన ఉచిత విద్యను పొందాలని మంత్రి పిలుపునిచ్చారు.

👉 నేరెళ్ల గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలు తీసుకున్న నిర్ణయాలను ప్రణాళిక ప్రకారం అమలు చేస్తామని మంత్రి తెలిపారు.
