మేడారంలో 30 పడకల  ఆరోగ్య కేంద్రం ప్రారంభం!

👉 పేద ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ లక్ష్యం !

👉 ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

పేద ప్రజలకు అవసరమైన వైద్యాన్ని అందించడం ప్రభుత్వ లక్ష్యమని , రాజీవ్ ఆరోగ్యశ్రీ  పరిమితి ₹10 లక్షలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానిది అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు.
ధర్మారం మండలం నాకు రాజకీయంగా జన్మనిచ్చిందని.. 2006లో జెడ్పీటీసీ గా గెలిపించారని, నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ధర్మారం మండలానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ …..

రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి అన్నారు. ధర్మారం మండలంలోని అన్ని గ్రామాలకు సౌకర్యంగా ఉంటుందని మేడారంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేశామని మంత్రి తెలిపారు.

👉 మండల ప్రజలు మేడారంలోని ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తిస్థాయిలో  వినియోగించుకోవాలని మంత్రి కోరారు  ఆస్పత్రిలో వైద్యుల కోరత, మందుల కోరత లేకుండా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.

👉 ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనుల కోసం ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేసి పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

👉 జిల్లా కలెక్టర్ తో పాటు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు క్రమం తప్పకుండా ఆసుపత్రిలో తనిఖీ చేసి ప్రజలకు అందుతున్న సేవలను గుర్తించాలని సూచించారు. ఆసుపత్రి నిర్మాణం కోసం స్థలం ఇచ్చిన దాతలను ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో నంది మేడారం సర్పంచి వీర్ పాల్ , స్థలదాత నర్సింగరావు తో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.